విశాఖ నార్త్‌లో రీపోలింగ్ జరపండి..

 


బొత్స డిమాండ్
-ఈసీ ద్వివేదికి ఫిర్యాదు..
విజయవాడ,  (globelmedianews.com)
విశాఖ నార్త్ నియోజకవర్గంలో ఈవీఎం మాయం కావడంపై మాజీ మంత్రి, వైకాపా నేత బొత్స సత్యనారాయణ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేదికి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కౌంటింగ్‌కు 4 రోజుల ముందు విశాఖ నార్త్ ఆర్వోను మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులు సరిపోలలేవని అన్నారు. ఆయా కేంద్రాల్లో రీపోలింగ్ జరిపి న్యాయం చేయాలని సీఈవోకు బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.


విశాఖ నార్త్‌లో రీపోలింగ్ జరపండి..

No comments:
Write comments