అభివృద్దికి సహకరిస్తాం

 


అనంతపురం, మే 27 (globelmedianews.com)
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుడు అనంత వెంకటరామిరెడ్డి నగరంలో ప్రశాంతతను కాపాడుతారని ఆశిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. అనంతపురం లోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకు ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్లలో శక్తి మేర అనంతపురం అభివృద్ధి కోసంఅహర్నిశలు కృషి చేశామన్నారు. 


అభివృద్దికి సహకరిస్తాం
మీరు చేసే అన్ని విధాలా అభివృద్ధికి సహకరిస్తామని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతీది రాజకీయం చేయమని అన్నారు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా వారు ఎన్టీఆర్ వైఎస్ విగ్రహాలను కూల్చడం తగదన్నారు. ఎవరన్నా  ప్రోత్సహించిన అది తప్పు అన్నారు.  ఇప్పటికే అనంతపురం లో 80 శాతం పూర్తి అయిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కొలిక్కి తేవాలని ఇంకా వివిధ దశలో ఉన్న పనులను పూర్తి చేస్తే అనంతపురం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. 

No comments:
Write comments