హజీపూర్ దీక్ష భగ్నం

 


యాదాద్రి భువనగిరి మే 18, (globelmedianews.com
బొమ్మలరామారంలో హాజీపూర్ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసారు. వరుస హత్యల నిందితుడు శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష విధించాలని,  గ్రామవాసులు దీక్షకు కూర్చున్నారు.శుక్రవారం  రాత్రి దీక్షా స్థలం వద్ద దాదాపు 200 మంది పోలీసులు మోహరించారు.  అర్థరాత్రి రెండు గంటల సమయంలో పోలీసులు వారి దీక్షను భగ్నం చేశారు.హజీపూర్ దీక్ష భగ్నం

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా దీక్ష చేస్తున్నలవారిని అదుపులోకి తీసుకున్నారు. అందోళనకారులను మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే, తమకు న్యాయం జరిగే వరకూ దీక్ష విరమించేది లేదని గ్రామస్థులు పట్టుబట్టారు.విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సినీయర్ నేత వి హనుమంతరావు జవహర్ నగర్ పోలీసు స్టేషన్ చేరుకుని అందోళనకు దిగారు.  నిరాహార దీక్ష చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేయడం పై  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడిచిపెట్టాలి, మర్రి శ్రీనివాస్ రెడ్డి ని వెంటనే ఉరి తీయాలి,  హజీ పూర్ లో వెంటనే వంతెన ఏర్పాటు చేసి సౌకర్యవంతమైన రోడ్డు రవాణా రప్పించాలని అయన డిమాండ్ చేసారు.

No comments:
Write comments