నిర్వాసితులకు న్యాయం జరగాలి

 

సిద్దిపేట మే 14 (globelmedianews.com)
సిద్దిపేట జిల్లా   కొండపోచమ్మ,మల్లన్న సాగర్ భూ నిర్వసుతులకు న్యాయం కోసం మాజీ ఎమ్మెల్యే , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షకు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ సంఘీభావం తెలిపారు. మంగళవారం అయన దీక్షా శిబిరానికి వచ్చారు. పొన్నం మాట్లాడుతూ  రైతుల పట్ల ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలి.  కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్ట్ లకు వ్యతిరేకం కాదు.  భూ నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.  కోర్ట్ తీర్పును ఒక చిల్లర పంచాయితిగా కేసీఆర్ అభివర్ణించాడని విమర్శించారు. కోర్ట్ పనులు ఆపమని చెప్పింది,కానీ భూ నిర్వాసితులకు న్యాయం చేయకుండా పనులు జరపడమేంటి.  


నిర్వాసితులకు న్యాయం జరగాలి

రైతులలు ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించడం తప్ప,నర్సారెడ్డి పట్ల పోలీసుల తీరును ఎండగడుతున్నాం.  ప్రాజెక్ట్ నిర్మాణం కావాలి ఈ ప్రాంత రైతుల భూములు సస్యశ్యామలం కావాలి కానీ ఆ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. ఇప్పుడీ వరకు మేనిపిస్టో గురించో, రైతుల సమస్యలు కోసమో కాకుండా ఎంతసేపు పెడరల్ ప్రంట్ పేరుతో తీర్థయాత్రలు తిరగుతూ మానసిక ఆనందం పొందుతున్నాడే తప్ప ఏ ఒక్క సమస్య గూర్చి మాట్లాడకపోవడం దారుణం.  ప్రాజెక్ట్ పనులలో జాప్యం చేస్తూ ఆ నిందలు కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ రుద్దుతున్నాడు. హై కోర్ట్ స్టే తో ఆగిపోయిన పనులను ప్రభుత్వం నిర్వాసితులను భయబ్రాంతులకు గురిచేసి పనులు చేస్తుంది,కోర్ట్ ప్రత్యేక నివేదిక తెప్పించుకుని నిర్వాసితులకు న్యాయం చేయాలని అన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలో రైతులు ఆత్మహత్య యత్నం చేసుకోవడం దారుణమని అన్నారు. 

No comments:
Write comments