క్యాబినేట్ సమావేశం హాస్యస్పదం

 

హైదరాబాద్  మే 04 (globelmedianews.com)
ఐదేళ్లుగా దేశంలో ఎవ్వరూ చేయనంత అవినీతి చంద్రబాబు చేశారు. చంద్రబాబు క్యాబినెట్ మీటింగ్ పెడతాననడం హాస్యాస్పదం.క్యాబినెట్ లో ఏం నిర్ణయాలు తీసుకుంటారు. రైతులకు రుణమాఫి అని చెప్పి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారా అని వైకాపా అధికారప్రతినిధి  వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఐదునెలలుగా కొందరు ఉద్యోగులకు ఇవ్వని జీతాలను మంజూరు చేసి ఇచ్చేస్తారా. క్యాబినెట్ సమావేశానికి ఎవర్ని పిలుస్తున్నారు. మంత్రులందరూ కూడా తలో చోట దాక్కుంటున్నారు. చంద్రబాబు ఆయన చెంచాలు తప్ప మరెవరు కనబడటం లేదు. ఆర్దిక మంత్రిగా యనమలను పిలుస్తున్నారా లేక కుటుంబరావును పిలుస్తున్నారా అని అడిగారు. హోంమంత్రి చినరాజప్పను పిలుస్తున్నారా లేక ఏబి వెంకటేశ్వరరావును పిలుస్తున్నారా. 


క్యాబినేట్ సమావేశం హాస్యస్పదం

ఇరిగేషన్ మంత్రి దేవినేనిని పిలుస్తున్నారా లేక రాయపాటిని పిలుస్తున్నారా ఐటి శాఖమంత్రి లోకేష్ ను పిలుస్తున్నారా లేక ఈవిఎంల దొంగ హరిప్రసాద్ ను పిలుస్తున్నారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈరోజు క్యాబినెట్ పెట్టి ఏం నిర్ణయాలు తీసుకుంటారు. మాట్లాడితే సిఎస్ రావడంలేదంటారు.సిఎస్ అంటే మీకు ఎందుకు భయం. మీ దగ్గర ఐదుగురు సిఎస్ లు పనిచేస్తే ముగ్గురు పంటికింద రాయిగా మారారంటే మీ పాలన ఎలా ఉందో అర్దమవుతుందని అన్నారు. నా పాపాలు ఏవి కూడా బయట కూడదనే తాపత్రయం మీలో కనబడతోంది. చంద్రబాబు చేష్టలు చూసి టిడిపి శ్రేణులో నవ్వుకుంటున్నాయి. నరేంద్రమోది నాలుగు సమావేశాలు పెట్టాడు నేను పెట్టకూడదా అనే చంద్రబాబు వంతులు వేయడం ఏంటి. నిన్న గాక మొన్న తప్పిపోయిన ఫోని తుపానును నేను విజయవంతంగా అడ్డుకున్నానని చెప్పడం  ఏంటని అడిగారు. నెటిజెన్లు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు సిఎం అయినా తుపానులు,కరవులు వస్తున్నాయి. ఈవాళ గద్దె దిగే పరిస్దితి వచ్చింది కాబట్టి తుపాను కూడా తెలుసుకుని  తప్పిపోయింది. శ్రీకాకుళంలో కొద్ది ప్రాంతం దెబ్బతింది. చంద్రబాబులో ఎందుకు హుందా తనం లోపించిందని ఆలోచించాలి. జగన్  ఓ సినిమా చూస్తానికి వెళ్తే దానిని కూడా రాజకీయం చేయడమేంటి. కుటుంబంతో సినిమాకు వెళ్తే చంద్రబాబుకు ఏడుపు ఎందుకని అడిగారు. మీ కుటుంబం హైద్రాబాద్ లో లేదా అమరావతి కరకట్ట మీద ఉందా అని అన్నారు. చౌకబారు విమర్శలు చంద్రబాబు మానుకోవాలి. ఓటమి భయం ఇలా మాట్లాడిస్తుంది అని అనిపిస్తుంది. ఎన్టీఆర్ నుంచి సిఎం కుర్చీ ఎప్పుడైతే లాక్కున్నారో అప్పటినుంచి కూడా తన నీడను చూస్తే తానే భయపడే పరిస్దితిలో బతుగుతున్నారు. తన కుటుంబంలోగాని ఎన్టీఆర్ కుటుంబంలోగాని రాజకీయంగా ఎవరిని ఎదగనీయలేదని అన్నారు. జగన్  పరిపాలనను చూడాలని ప్రజలు తీర్పు ఇచ్చారని అర్దమయినతర్వాత దాని ఎఫెక్ట్ టిడిపిలో ఎక్కడ తగులుతుందో అనే భయంతో ఉంటున్నారు. సిఎం కుర్చీకి దూరం కావాల్సి వస్తుందనే భయం చంద్రబాబు కలుగుతోంది. టిడిపిలో ఎక్కడ తిరుగుబాటు వస్తుందో అనే భయం కారణంగా ఈసిపైన,ఈవిఎంలపై, జగన్  కుటుంబంపై చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆరోపించారు. 

No comments:
Write comments