సమస్యలపై నిర్లక్ష్యం సహించేది లేదు

 

గుంటూరు, మే 1,  (globelmedianews.com
ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకొని ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న ఎన్నికల కమిషన్ సి ఎస్ కలెక్టర్ ఉద్యోగులను సహించేది లేదని టీడీపీ నేత, ఎంపి గల్లా జయదేవ్ తెలిపారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నందున సంబంధిత అధికారులు చొరవ తీసుకొని తాగునీరు ప్రజలకు అందించాలని అన్నారు. 


సమస్యలపై నిర్లక్ష్యం సహించేది లేదు

ఈ విధానంలో ఏదైనా ప్రజలు ఇబ్బందులకు గురైన ఎన్నికలకు అయినా సరే పక్కనపెట్టి ప్రజల సమస్యల పరిష్కారానికి కూడా వెనకాడబోమని ఎమ్మెల్యే డొక్క మాణిక్య రావు తెలిపారు. డొక్క మాణిక్య రావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎలక్షన్ కమిషన్ మున్సిపల్ ఆఫీసర్లు అందరూ కలసి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి పబ్లిసిటీ కన్వీనర్ చిట్టి బాబు మరియు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, రాజశేఖర్ యాదవ్ పాల్గొన్నారు.

No comments:
Write comments