అంతుబట్టని గాజువాక నాడి

 

విశాఖపట్టణం, మే 17, (globelmedianews.com)
గాజువాకలో గాజుగ్లాస్ గలగలలాడాల్సిందేనని పవన్ పోటీకి దిగుతారన్నపుడే వినిపించింది. పవన్ సైతం చాలా ఆర్భాటంగా నామినేషన్ దాఖలు చేశారు పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనాన్ని చూసి పవన్ గెలుపు ఖాయమని అనుకున్నారు. పవన్ మెజారిటీ లక్ష అని ఫ్యాన్స్ అయితే ఓ రేంజిలో లెక్కేసుకునిపోయారు. పవన్ పోటీతో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ సోదిలో లేకుండా పోతాయని కూడా అంతా భావించారు. అయితే మొత్తం కధ మొదటి పది రోజుల్లోనే మారిపోయిందని పోస్ట్ పోల్ సర్వే నివేదికలు చెబుతున్నాయి. పవన్ గెలుపు ఇపుడు డౌట్లో పడడానికి జనసేనాని వైఖరే ప్రధాన కారణమని అంటున్నారు. పవన్ అతి విశ్వాసానికి పోయారా..? లేక ప్రత్యర్ధులను లైట్ గా తీసుకున్నారో తెలియదు కానీ ప్రచార పర్వమే తప్పుదోవలో నడిచిందంటున్నారు.ఇక ఇపుడు జనసేన సమీక్షలో వెల్లడైన మరో వాస్తవం ఏంటంటే షాడో ఎమ్మెల్యే కధ. పవన్ గాజువాకలో గెలిస్తే పార్టీ నాయకులే లోకల్ లీడర్ అవుతారని బాగా న్యూస్ వైరల్ అయింది. ప్రచారం కీలకదశలో ఉన్నపుడు ఇలా జరగడంతో తేరుకోలేని డ్యామేజ్ జరిగిందని అంటున్నారు. 


అంతుబట్టని గాజువాక నాడి

పవన్ సెలిబ్రిటీ, పైగా అధినేత కాబట్టి ఆయన గాజువాకకు ఎక్కువగా రాలేకపోవచ్చునని, దాంతో తాము దుమ్ము రేపవచ్చునని కొందరు నేతలు అతికి పోయారని అంటున్నారు. ఇక పవనే ఎవరో ఒకరిని షాడో ఎమ్మెల్యేని చేస్తానని అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ తాము గెలిపించిన ఎమ్మెల్యే కాకుండా వేరెవరో పెత్తనం చేస్తారన్న న్యూస్ జనంలోకి వెళ్ళిపోయింది.దాన్ని ప్రతిపక్షాలు రాజకీయంగా బాగా వాడుకున్నాయి. చివరికి అది బాగా దెబ్బేసిందని తీరిగ్గా ఇపుడు జనసేన నాయకులు చింతిస్తున్నారు. పవన్ ఆ మాట అన్నారా లేక ప్రచారం జరిగిందా అన్నది కూడా తెలియదు కానీ తీరని నష్టం తెచ్చిపెట్టిందని అంటున్నారు. పవన్ ఎమ్మెల్యేగా ఉంటే ఆయన అధినేత కాబట్టి తక్కువ సార్లే వస్తారని, అందువల్ల లోకల్ నాయకుడే బలంగా ఎమ్మెల్యేగా ఉంటాడని కొందరు జనసైనికుల అతి ఉత్సాహమే చివరికి గెలుపు అవకాశాలను తగ్గించిందని అంటున్నారు.ఇక పవన్ తాజాగా చేసిన సమీక్షలో గాజువాకలో తాను గెలుస్తానని గట్టిగా చెప్పకపోవడం పట్ల విశాఖ జిల్లాకు చెందిన పార్టీ నాయకులు నిరాశ పడుతున్నారు. పవన్ సీట్లు కంటే ఓట్లే ముఖ్యమని అనడం పట్ల వారు ఏకీభవించలేకపోతున్నారు. సీట్లు అధికారమే రాజకీయమని, పవన్ లాంటి నాయకుడు పోటీ చేసిన చోట కూడా ఓట్లు ముఖ్యమని కనుక తీసుకుంటే ఇంక రాజకీయం చేయడం ఎందుకని కూడా ప్రశ్నిస్తున్నారు. విశాఖ జిల్లాలో ఒక్క సీటు కూడా జనసేన గెలుచుకోలేదా అన్నది ఇపుడు జనసైనికులను మధనపెడుతోంది. ఎలమంచిలి. పాడేరు, గాజువాకల్లో తప్పనిసరిగా గెలుస్తామని వారు గట్టి ఆశ పెట్టుకున్నారు. మరి అధినేత ఓట్లు తెచ్చుకుంటే చాలు అనడం అంటే ఆయన దగ్గర సర్వే ఏమైనా ఉందా అని జిల్లా నాయకులు అనుమానిస్తున్నారు. అన్నింటికంటే గాజువాక సీటు సంగతేంటన్నది ఇపుడు పార్టీ నాయకులకు పెద్ద బెంగ పట్టుకుంది.

No comments:
Write comments