తేమ సాకుతో దోపిడీ (పశ్చిమగోదావరి)

 

ఏలూరు, మే 13 (globelmedianews.com): 
కొనుగోలు కేంద్రాలకు వెళితే తేమశాతం సాకుగా చూపించడం సర్వసాధారణంగా మారింది. విధిలేని పరిస్థితిలో రైతులు పంటను దళారులకు అమ్ముకుంటున్నారు. జిల్లాలో రబీ సీజనులో 1.69 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. 13.60 లక్షల టన్నుల ధాన్యం పండుతుందని అంచనా. దీనిలో ధాన్యం కొనుగోళ్ల ద్వారా 11.50 లక్షల టన్నులు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. జిల్లాలో 294 కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 2.5 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు.సాధారణ రకం ధాన్యం ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 1750. సాధారణంగా జిల్లాలో 75 కేజీల బస్తాలు పడుతుంటారు. అంటే 75 బస్తాకు రూ. 1312లు దక్కాలి. కానీ రైతుల నుంచి దళారులు కొనే ధర మాత్రం రూ. 1050 నుంచి 1100 మాత్రమే. రైతులు ఎక్కువగా వరికోత యంత్రాలతో మాసూళ్లు చేపడుతున్నారు. 


 తేమ సాకుతో దోపిడీ (పశ్చిమగోదావరి)

తేమ ఉంటుంది. అన్నదాతలు కూడా ప్రస్తుతం తుపాను హెచ్చరికల నేపథ్యంలో తేమతోనే అమ్మేస్తున్నారు. కొంతమంది ముందుగా మాసూళ్లు చేపట్టిన రైతులు కొన్ని రోజులపాటు ఆరబెట్టుకున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి తేమ తనిఖీ చేయిస్తున్నా ఎక్కువగా ఉందంటూ తిరస్కరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. మరో రెండు రోజులు ఆరబెట్టాలని సూచనలు చేస్తున్నారని చెబుతున్నారు. దాంతో ఈ ఇబ్బందులు పడలేక దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. ఆరబెట్టిన ధాన్యానికి దళారులు 75 కేజీల బస్తాకు రూ. 1200 ఇస్తున్నారని రైతులు చెబుతున్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నమోదు అయిన తరవాత ఆ ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి. జిల్లాలో జరిగేది మాత్రం ముందుగా ధాన్యం మిల్లులకు చేరిపోతుంటుంది. అలా చాలావరకు ధాన్యం దళారుల ద్వారా రైసుమిల్లులకు చేరిపోయింది. రైసుమిల్లుల యాజమాన్యాలు రికార్డులు తీసుకొచ్చి నమోదు చేస్తుంటారు. అది జరిగితే రికార్డుల్లో ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాన పాత్ర మిల్లర్లు పోషించడంతో జిల్లా యంత్రాంగం ఎన్ని ఏర్పాట్లు చేసినా అవి ప్రహసనంగానే మారిపోతున్నాయి. జిల్లాలో మాసూళ్లు చివర దశకు వచ్చాయి. చాలా వరకు పొలాల్లోనే ఉన్నాయి. మరో పక్క ఫొని తుపాను జిల్లాపై ప్రభావం చూపిస్తుందని భావించినా, మేఘాలు భయపెట్టినా క్రమంగా ఆ ప్రభావం కనుమరుగైంది. ఈ నేపథ్యంలో పొలాల్లో ఉన్న ధాన్యాన్ని అప్పటికప్పుడు హడావుడిగా ఒబ్బిడి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పొలాల్లోనే బస్తాలకు నెట్టు కట్టి బరకాలు వేసి కప్పారు. తుపాను ముప్పు తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

No comments:
Write comments