ఎంసెట్ పరీక్షలు ప్రారంభం

 

హైదరాబాద్, మే 3 , (globelmedianews.com)
శుక్రవారం నుంచి తెలంగాణలో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 2.17.199 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 83 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ నెల 6వ తేదీ వరకు ఇంజనీరింగ్, 8, 9 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు.


ఎంసెట్ పరీక్షలు ప్రారంభం

ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్ట్తో పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్షా  కేంద్రాలకు  ఒక్కనిమిషం ఆలస్యం నిబంధన ఉండడంతో విద్యార్థులు గంట ముందుగానే ఆయా సెంటర్ వద్దకు చేరుకున్నారు   పరీక్షా కేంద్రంలో కి విద్యార్థుల హాల్ టిక్కెట్లు పరిశీలించి లోపలకి పంపించారు. 

No comments:
Write comments