కేంద్రంలో లౌకిక విధానాలతో కూడిన ప్రభుత్వం ఏర్పడుతుంది

 

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌
తిరువనంతపురం మే 7  (globelmedianews.com):
త్వరలో కేంద్రం లో సమాఖ్య, లౌకిక విధానాలతో కూడిన  ప్రభుత్వం ఏర్పడుతుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తన మధ్య జరిగిన సమావేశం గురించి విజయన్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. తమ మధ్య కీలక చర్చ జరిగిందని తెలిపారు. ‘త్వరలో సమాఖ్య, లౌకిక విధానాలతో కూడిన కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుందని పేర్కొన్నారు. నిన్న కేసీఆర్‌తో చాలా ప్రాముఖ్యతగల సమావేశం జరిగింది. దేశ రాజకీయ పరిస్థితుల గురించి కేసీఆర్‌ చర్చించారు. ఆయన చెప్పిన విషయాల ప్రకారం... దేశంలో ఎన్డీఏ, యూపీఏ మెజార్టీ సాధించలేవు. ప్రాంతీయ పార్టీలకే మెజార్టీ వస్తుంది. దీంతో కేంద్రంలో ఈ పార్టీలో కీలక పాత్ర పోషిస్తాయి.


కేంద్రంలో లౌకిక విధానాలతో కూడిన  ప్రభుత్వం ఏర్పడుతుంది

ప్రధానమంత్రి అభ్యర్థి గురించి నిన్న జరిగిన సమావేశంలో చర్చించలేదు’ అని వ్యాఖ్యానించారు.కాగా, దేశ రాజకీయాలు, సమాఖ్య కూటమిపై చర్చించడానికి కేసీఆర్‌.. ఈ నెల 13న తమిళనాడు రాజధాని చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌తో ఆయన నివాసంలో సమావేశం కానున్నట్లు ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ రోజున వీరిద్దరి మధ్య సమావేశం జరగడం లేదని డీఎంకే వర్గాలు తెలిపాయి. మే 19న జరిగే రాష్ట్రంలోని నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తూ స్టాలిన్‌ ప్రస్తుతం తీరిక లేకుండా ఉన్నారని డీఎంకే స్పష్టం చేసింది. గతంలో స్టాలిన్‌ను కేసీఆర్‌ ఓ సారి కలిశారు. అయితే, ఈ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం డీఎంకే.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది.  భాజపా, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయంగా సమాఖ్య కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుపుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సోమవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిసి చర్చించిన విషయం తెలిసిందే. 

No comments:
Write comments