నిధులు లేక విలవిలాడుతోన్నతెలంగాణా రాష్ట్ర ఖజానా

 

హైదరాబద్ మే 14 (globelmedianews.com)
నిధులు లేక తెలంగాణా రాష్ట్ర ఖజానా విలవిలాడుతోంది. రోజువారీ ఖర్చులకు కూడా బ్యాంకు ఓవర్ డ్రాప్ట్ ల ఫై ఆధారపడవల్సి వస్తోంది. నెలల తరబడి బిల్లు రాకా చిన్న స్థాయి నుంచి మధ్య స్థాయి కాంట్రాక్టర్ల వరకూ నానా బాధలు పడుతుండగా, నెల మొదటి తేదీన జీతం వస్తుందన్న నమ్మకం ఉద్యోగస్తులకు కలగటం లేదు. దాదాపు తొమ్మిది నెలలుగా ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కొత్త పధకాలు ప్రారంభానికి కొంత వెసులుబాటు కలిగినా ఈనెల 23వతేదీ తో కోడ్ గడువు పూర్తి అవుతుండటంతో తదుపరి సర్దుబాట్లకు ఏమి చేయాలో అధికారులకు అంతు బట్టడం లేదు. ఇప్పటికే సుమారు ఆరువేల కోట్ల రూపాయల వరకూ రిజర్వ్ బ్యాంకు వద్ద ఓవర్ డ్రాఫ్ట్ ఉండటంతో వచ్చే నెల జీతాలకు ఏమి చేయాలనే అంశం ఫై ఆర్ధిక శాఖ అధికారులు మల్ల గుల్లాలు పడుతున్నారు. మార్చి నెలలో ఇదే పరిస్థి తలెత్తితే ఒక దశలో రిజ‌ర్వు బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వడానికి నిరాకరిస్తే సాక్షాతూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థి ఏర్పడింది.


నిధులు లేక విలవిలాడుతోన్నతెలంగాణా రాష్ట్ర ఖజానా 

గత శాసన సభ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో కొన్నింటిని అమలు చేయాలన్నా తక్షణం 10వేలకోట్ల రూపాయాలు అవసరం పడుతున్నాయని,పెన్షన్ల పెంపు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలకు హామీ ఇచ్చిన ప్రకారం అమలు చేయడం కష్ట సాధ్యం అని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్ర‌భుత్వ‌ ఉద్యోగుల పదవి విరమణ వయసును 61 సంవత్సరాలుగా పెంచుతామని ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు హామీ ఇచ్చారు. డిసెంబర్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఈ పెంపు అమలు అవుతుందని ఉద్యోగులు ఆశ గా ఉన్నారు. వివిధ కారణాల వల్ల ఇది అమలు చేయటం కుద‌ర‌కపోవటంతో పదవి విరమణ కు దగ్గరలో ఉన్న అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇంత వరకూ సుమారు రెండు వేల మంది ఉద్యోగులు పదవి విరమణ పొందారని, మే, జూన్ నెలలో సుమారు 1500 మంది ఉద్యోగులు పదవీవిరమణ చేయడానికి సిద్ధంగా ఉన్నారని, వారంతా వెంటనే పెంపు చేయాలని కోరుతున్నారు.దీనికి తోడు రెవెన్యు పాస్ పుస్తకాల్లో ఏర్పడిన తప్పుల వల్ల డిసెంబర్ నెలలో పంపిణి కావాల్సిన రైతుబంధు పధకం లో చాలా మంది రైతులకు డబ్బులు జమకాలేదు. అదేవిధంగా రహదారులు, భవనాలు, నీటిపారుదల, మిషన్ భగీరథ పథకాలకు చెందిన కాంట్రాక్టర్లు నెలలు తరబడి బిల్లు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. వీరివద్ద పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులుకు నెలల తరబడి జీతాలు రావటం లేదు.

No comments:
Write comments