తోటి ఎస్సై కుటుంబాన్ని అదుకున్న బ్యాట్ మేట్లు

 

రాచకోండ మే 04 (globelmedianews.com)
ఈ యేడాది మార్చి లో రాచకోండ పరిధిలోని పోచంపల్లి ఎస్సై గా విదులు నిర్వహించిన  మధుసూదన్  నల్గొండ కు పోలీస్ రిక్రూట్మెంట్ ఈవెంట్స్ బందోబస్తు కు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన సంగతి తెలిసిందే. అయన వాహనం నార్కెట్ పల్లి మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నార్కెట్ పల్లి దగ్గర అదుపు తప్పింది. ఈ ఘటన లో అయన అక్కడికక్కడే చనిపోవడం జరిగినది. మధుసూదన్ బ్యాచ్ కు చెందిన ఉమ్మడి ఏపీ ఎస్సైలు అయన కుటుంబానికి ఆర్ధిక సహయం అందించారు. 


తోటి ఎస్సై కుటుంబాన్ని అదుకున్న బ్యాట్ మేట్లు

మధుసూదన్ తల్లిదండ్రులకు రూ నాలుగు లక్షలు, కూతురు కు రూ ఆరు లక్షలు ఫిక్స్డ్ డిపాజీట్ రూపములో శనివారం రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ చేతులమీదుగా ఇప్పించారు. బ్యాచ్ మేట్ లను సీపీ అభినందించారు. ఈ సంవత్సరం పిల్లల స్కూల్ ఫీజును చెల్లిస్తానని సీపీ తెలిపారు, మధుసూదన్ భార్యకు ఉద్యోగం త్వరలో వచ్చేవిదంగా చర్యలు తీసుకుంటామని సీపీ  చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీసుల సంఘం అధ్యక్షుడు వూ. గోపిరెడ్డి, ఉమ్మడి సైబరాబాద్, రాచకొండ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు  భద్రారెడ్డి సభ్యులు ప్రభాకర్ రెడ్డి , 2012 ఎస్సైలు .విజయ్,  సంజీవరెడ్డి,. జగన్ రెడ్డి,. అనిల్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments