పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా తలారి పెద్దయ్య

 


తుగ్గలి మే 18 (globelmedianews.com):
మండలం పరిధిలోని శభాష్ పురం గ్రామానికి చెందిన తలారి పెద్దయ్య ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ అసోసియేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.2009 సంవత్సరంలో కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు,అనంతరం పెద్దయ్య అనంతపురం పట్టణంలోని 14వ ఏపీఎస్ బెటాలియన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు.మొదట ఏపీఎస్ బెటాలియన్ తరఫున కమిటీ మెంబర్ గా ఎన్నికయ్యారు, అటు తర్వాత బెటాలియన్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు,మరల రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎన్నికయ్యారు.పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర  ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా తలారి పెద్దయ్య

ఈయన ఎంపిక పట్ల శభాష్ పురం గ్రామానికి చెందిన వారు శనివారం ఆయనను అభినందించారు.గతంలో విద్యార్థి దశలోనే పత్తికొండ పట్టణంలో ఉన్న సమయంలో విద్యార్థులకు అనేక సహాయ సహకారాలు అందించారు.అంతేగాక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు ఆయనలో కనిపించడం జరిగింది.ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేసే పోలీస్ అసోసియేషన్కు రాష్ట్ర కమిటీ లో ఎగ్జిక్యూటివ్ నెంబర్ గా రావడం శభాష్ పురం గ్రామానికి గుర్తింపు వచ్చిందన్నారు.ఈయన ఎంపిక పట్ల ఆయన మిత్రులు శేఖర్,మోహన్,సందీప్ హర్షం ప్రకటించారు.

No comments:
Write comments