రీపోలింగ్ కు సహకరించాలి

 

ఒంగోలు, మే 02, (globelmedianews.com):
జిల్లాలో యరగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతలలో  ఈ నెల 6వ తేదీన రీపోలింగ్ నిర్వహించడానికి అభ్యుర్ధులు, రాజకీయపార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినయ్ చంద్ కోరారు.  గురువారం  స్థానిక ఒంగోలు ప్రకాశం భవనంలోని జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ లో  రీపోలింగ్ పై జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లా లో ఏప్రిల్ 11 వతేదీన జరిగిన  ఎన్నికలు మూడు వేల 269 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు ప్రశాంతంగా  జరిగాయన్నారు. 


రీపోలింగ్ కు సహకరించాలి

జిల్లాలోని యరగొండపాలెం నియెజకవర్గ పరిధిలోని కలనూతల గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నెం 247లో  1070 మంది ఓటర్లకు గాను 40 నుండి 50 మంది ఓటర్ల వరకు అర్ధరాత్రి 12 గం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ స్లీపింగ్ మోడ్ లోకి వెళ్లడం తో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారన్నారు. పోలింగ్ కేంద్రాంలోని ప్రిపైడింగ్  అధికారి సెక్టార్ అధికారి కి కమ్యూనికేషన్ లేకపోవడం వలన రెండవ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వినియోగించలేకపోయారన్నారు.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యరగొండపాలెం నియోజకవర్గం లోని కలనూతల గ్రామంలో రీపోల్ నిర్వహించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. కలనూతల గ్రామంలో ఈ నెల 6వ తేది న ఉదయం 7 గం నుండి సాయత్రం 6గం వరకు మండల పరిషత్ ఎలిమెంటరి స్కూల్ లో పోలింగ్ జరుగుతుందన్నారు.  కలనూతల గ్రామంలో జరిగే  రిపోలింగ్ లో ఓటర్లు అందరూ వారి ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని గ్రామంలో టాం టాం ద్వారా తెలియజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు.ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ యస్. నాగలక్ష్మి, ప్రత్యేక కలెక్టర్ చంద్రమౌళి, జిల్లా రెవిన్యూ అధికారి వి.వెంకట సుబ్బయ్య , తదితరులు పాల్గొన్నారు

No comments:
Write comments