కసరత్తు ప్రారంభించిన వైఎస్ జగన్మోహనరెడ్డి

 


విజయవాడ, మే 24  (globelmedianews.com)
ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అప్పుడే పరిపాలనపై కసరత్తు ప్రారంభించారు. నిన్న ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయనను ఇవాళ వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు కలిశారు. వారి శాఖల గురించి ఆయన వారితో చర్చిస్తున్నారు. ప్రమాణస్వీకారం చేశాక తీసుకోవాల్సిన చర్యలపై ఆయన మాట్లాడుతున్నారు. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ ను కలిసిన వారిలో ఐఏఎస్ లు జయశ్రీ ప్రసాద్, సాంబశివరావు, సతీష్ చంద్ర, కరికల వలవన్, అహ్మద్ బాబు, కన్నబాబు, రవిచంద్ర, సత్యనారాయణ, సంధ్యారాణి, అజయ్ జైన్, గిరిజాశంకర్, రాజమౌళి తదితరులు ఉన్నారు.


కసరత్తు ప్రారంభించిన వైఎస్ జగన్మోహనరెడ్డి 
అమరావతిలోని తాడేపల్లిలో కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. కనీవినీ ఎరుగని భారీ విజయం సాధించిన జగన్ ను కలిసేందుకు పార్టీ నూతన ఎమ్మెల్యే, నేతలు క్యూ కట్టారు. జగన్ ను కలిసి వారు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలు విభాగాల ఉన్నతాధికారులు సైతం జగన్ ను కలుస్తున్నారు. తిరుమల నుంచి టీటీడీ ఈవో అనీల్ సంఘాట్, వేద పండితులు జగన్ ను కలిశారు. వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.వ్యాంధ్రకు కాబోయే సీఎం వైఎస్ జగన్ ను ఈ ఉదయం టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కలిశారు. తిరుమలలో స్వామివారికి ప్రత్యేకంగా ధరింపజేసిన పూజా మాల, ప్రసాదాలను తీసుకుని వచ్చిన ఆయన, జగన్ కు వాటిని అందించారు. ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. సింఘాల్ తో పాటు డాలర్ శేషాద్రి, మరికొందరు అధికారులు జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు. సాధ్యమైనంత త్వరగా తాను స్వామివారిని దర్శించుకుంటానని ఈ సందర్భంగా జగన్ వారికి వెల్లడించారు.

No comments:
Write comments