తితిదే ఆర్జిత సేవా టికెట్లు విడుదల

 

తిరుమల మే 03 (globelmedianews.com)
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను తితిదే విడుదల చేసింది. ఆగస్టు నెలకు సంబంధించి 67,737 ఆర్జిత సేవా టిక్కెట్లను తితిదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇందులో 11,412 సేవా టిక్కెట్లను ఆన్‌లైన్‌ డిప్‌ విధానానికి కేటాయించారు. సుప్రభాత సేవ 8,117, తోమాల సేవ 120, అర్చన 120, అష్టదళ పాదపద్మారాధన 180, నిజపాద దర్శనం 2,875 టిక్కెట్లు కేటాయించారు. 


తితిదే ఆర్జిత సేవా టికెట్లు విడుదల

సాధారణ పద్ధతిలో 56, 325 టిక్కెట్లను కేటాయించగా... అందులో విశేషపూజ 1,500, కల్యాణోత్సవం 13,300, ఊంజల్‌సేవ 4,200, వసంతోత్సవం 14,300, సహస్ర దీపాలంకార సేవ 15,600, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,425 టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. డిప్‌ పద్ధతిలో ఉన్న టిక్కెట్లకోసం నమోదుకు నాలుగు రోజుల పాటు అవకాశం కల్పించారు. నమోదు చేసుకున్న వారికి డిప్‌ విధానం ద్వారా ఆర్జిత సేవా టిక్కెట్లను కేటాయిస్తారు.

No comments:
Write comments