సీఎం వర్సెస్ సీఎస్

 

విజయవాడ మే 7, (globelmedianews.com)
ఎలక్షన్ కోడ్ వచ్చిన తరువాత మాట్లాడటం మానేశాను. ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్దితి వచ్చింది. ప్రధాని బీహార్ లో చాలా తప్పు మాట్లాడారు. ఇండియా పాకిస్తాన్ లా ఆంద్ర తెలంగాణా ఉన్నాయనడం సరైంది కాదు. విభజన జరిగిన తీరుపై , విభజన సమయంలో వ్యవహరించిన దానిపై కొత్తగా ఎన్నికైన  వారైనా మాట్లాడాలని కోరుకుంటున్నానని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. మంగళవారం అయన విజయవాడ ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో జరిగిన  మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఉండవల్లి మాట్లాడుతూ పోలవరం పూర్తితే అది ఆంద్రాకి పెద్ద బహుమతే. పోలవరంపై నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలేదని అన్నారు. నేను అడిగే ప్రశ్నలు తప్పయితే క్షమాపణ కోరుకుంటాన. 


సీఎం వర్సెస్ సీఎస్

ఇరిగేషన్ మంత్రి నీరిచ్చేస్తున్నాం అంటుంటే .. ముఖ్యమంత్రి వచ్చే ఏడాది తరువాత పోలవరం నీరు ఇస్తున్నామంటున్నారు. పోలవరంపై అసలు మీ ప్లాన్ ఏమిటో చెప్పకుండా ఉంటే రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు ఉంటాయని హెచ్చరించారు. 300 కోట్లతో పూర్తయ్యే పట్టిసీమకి 1000కోట్లు ఖర్చు పెట్టారు. పోలవరం విషయంలో నాణ్యత లేకపోతే చాలా ధన , ప్రాణ నష్టాలు జరుగుతాయి. ఇప్పటికైనా ప్రజలకు నిజాలు చెప్పండని అన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు చేస్తున్న తప్పును రాష్ట్ర ప్రజలు క్షమించరు. అక్కడ పనిచేసే ప్రతి ఇంజనీరు పోలవరంలో జరపగుతున్న తప్పిదాలను నాకు మొరపెట్టుకున్నారు. నిర్వాసితుల పరిస్దితి ఏమిటో తెల్చకుండా నీరు ఎలా వదులుతారు.ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ సియం వర్సెస్ సియస్ అని అన్నారు.  ఎన్నికల కొడ్ అమలులో ఉన్నప్పుడు ఎన్నికల కమీషన్ కే అధికారాలు ఉంటాయి. ఎల్వీ  సియస్ గా వచ్చిన వెంటనే అతనిపై మాటల యుద్దం మొదలు పెట్టారు. హ్యాపీగా కౌంటింగ్ వరకు ఉండకుండా చంద్రబాబు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తున్నారు. యాంటీమోడీలో మీరే ముందున్నారు. నేను కూడా మోడి వ్యతిరేకినే. ఈవియంలు ట్యాంపరింగ్ అంటున్నారు మళ్ళి 130స్దానాలు వస్తాయంటున్నారని అన్నారు.

No comments:
Write comments