పొంచి ఉన్న ప్రమాదం

 


కౌతళం  మే 27 (globelmedianews.com)
మండల కేంద్రము లో పింజరు కాలనీలో ప్రమాదం పొంచి ఉందని కాలని వాసులు మొర పెట్టుకున్నారు.20 రోజుల క్రితం నీటి పైపుల కోసం తీసిన గుంత ఇంతవరకు మరమ్మతులు గాని, గుంతను పూడ్చడం కానీ చేయ లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. 


పొంచి ఉన్న ప్రమాదం 
పిల్లలు ఆడుకుంటూ గుంతలో పడతారని, ద్విచక్ర వాహనాలు అదుపు తప్పితే గుంతల్లో పడతారని భయందోళన కలుగు తుంది అని అంటున్నారు.  అధికారులు గుంతలు తీసి మరి ఇంతవరకు తిరిగి చూడలేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇప్పటి కైన అధికారులు మేల్కొని నీటి పైపులు మరమ్మతులు చేసి గుంతలు వెంటనే పూడ్చాలని కోరుతున్నారు.

No comments:
Write comments