మావోయిస్టు నేత మంగ్లీ అరెస్ట్

 

దంతేవాడ, మే 01 (globelmedianews.com)  
మావోయిస్టు మహిళా అగ్రనేత మంగ్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె మీద పది కేసులు వున్నట్లు దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ వెల్లడించారు. కోసీ అలియాస్ మంగ్లీ పై ఐదు లక్షల రూపాయల రివార్డ్ వుంది.  


మావోయిస్టు నేత మంగ్లీ అరెస్ట్

2011 నుంచి మావోయిస్టుల్లో పనిచేస్తున్న మంగ్లీ.. భద్రతా దళాలు, గ్రామస్థులపై దాడిచేసిన కేసులో నిందితురాలని ఎస్పీ తెలిపారు. మలివాడలో మందుపాతర పేల్చివేత, 2016లో సీఆర్పీఎఫ్ బలగాలను చంపిన కేసు, చోలనర్ లో మందుపాతర పేల్చి ఐదుగురు పోలీసులను చంపిన కేసులో మంగ్లీ నిందితురాలని పేర్కొన్నారు.

No comments:
Write comments