కాన్సర్ రోగులకు పాలిటివ్ కేర్ సెంటర్

 


కర్నూలు,మే,18 ,(globelmedianews.com):
కాన్సర్ రోగులు చివరి దశలో వున్న వారికి పాలిటివ్ కేర్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని  జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అన్నారు. శనివారం ప్రభుత్వ  సర్వజన ఆసుపత్రి పేయింగ్ బ్లాక్ రెండవ అంతస్ధులో క్యాన్సర్ రోగుల విభాగాన్ని  ఆయన ప్రారంభించారు.  కాన్సర్ రోగులకు పాలిటివ్ కేర్ సెంటర్

ఆసుపత్రి పర్యవేక్షకులు డా.చంద్రశేఖర్, మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డా.రాంప్రసాద్, డియంఅర్ హెచ్ ఓ డా. ప్రసాద్, డిప్యూటి డియం అండ్ హెచ్ ఓ డా.చంద్రారావు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాలిటివ్ కేర్ సెంటర్ క్యాన్సర్  రోగులకు అందిస్తున్న సేవలు మరవలేనివన్నారు. పెయిన్ రిలీఫ్ , పాలిటేటిల్ కేర్ సొసైటి, హైద్రాబాద్ సంస్ధ ప్రతి నెల రూ.౩ లక్షలను క్యాన్సర్ రోగులకు ఖర్చు చేస్తుందన్నారు. ఒక అంబులెన్స్, ఒక డాక్టర్ , అయిదు మంది సిబ్బంది ఈ ఎన్.జీ.ఓ సంస్ధ నియమించి రోగులకు సేవలందిస్తుందన్నారు.  ఈ కార్యక్రమంలో సంస్ధ ప్రతినిధి జగన్నాద్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

No comments:
Write comments