అత్త, కోడలిని తల్వార్ తో నరికి చంపిన దుండగులు

 

రంగారెడ్డి, మే 7, (globelmedianews.com)
రంగారెడ్డి  జిల్లాలోని సైబరాబాద్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవ్ పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని వట్టేపల్లిలో కొందరు గుర్తుతెలియని దుండగులు అత్తా కోడలిని అతి కిరాతకంగా నరికి చంపారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మృతులను కోడలు తబీయా (25) ఆమె అత్త  సబీహా బేగం (55) గా పోలీసులు గుర్తించారు. ఇద్దరిని అతి దారుణంగా తల్వార్తో దాడి చేసిన దుండగులు పరారయ్యారు. 


 అత్త, కోడలిని తల్వార్ తో నరికి చంపిన దుండగులు 

ఈ  జంటహత్యలకు ప్రేమపెళ్లినే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిజామాబాద్ కు  చెందిన మోహిన్, తబియా కొద్దిరోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మోహిన్ సోమవారం రాత్రి డ్యూటీ నుంచి వచ్చేసరికి తల్లి, భార్య రక్తపు మడుగులోపడి ఉండటాన్ని చూసి  భయాందోళనకు గురైయాడు. వెంటనే  పోలీసులకు సమాచారం అందించాడు. వీరంతా నాలుగు నెలల క్రితం నిజామాబాద్ నుంచి  హైదరాబాద్  కు వచ్చి రోషన్ కాలనీలో వీళ్లు ఉంటున్నారు

No comments:
Write comments