యువకుడి దారుణ హత్య

 

గిద్దలూరు, మే 15 (globelmedianews.com)   
ప్రకాశం జిల్లా గిద్దలూరు కొంగలవీడు గ్రామం అంకాలమ్మ గుడి సమీపంలో కొండ ప్రాంతంలో ఒక యువకుడిని హతమార్చి పూడ్చిపెట్టిన సంఘటన గిద్దలూరు లో కలకలం రేపింది. ఈ విషయాన్ని తెలుసుకున్న గిద్దలూరు ఎస్సై మదర్ వల్లి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. 


యువకుడి దారుణ హత్య

అనంతరం కేసుపై దర్యాప్తు చేస్తున్నారు  వివరాల్లోకి వెళితే గిద్దలూరు మండలంలోని కొంగలవీడు ఎస్సీ కాలనీకి చెందిన రోశయ్య కుమారుడు దాసరి రమణ  గా గుర్తించారు. మృతుడు రాత్రి ఇంటి పైన నిద్రిస్తున్న సమయంలో  స్నేహితులతో కలిసి సరదాగా బయటికి వెళదామని తీసుకు వెళ్లినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అలానే మృతుడు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నాడని మృతుని తల్లిదండ్రులు తెలిపారు.   రమణ ను హత్య చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అతనికి ఎవరు శత్రువులు లేరు అని తల్లిదండ్రులు విలవిలలాడిపోతున్నారు. 

No comments:
Write comments