బీజేపీ ధర్నా

 

విజయవాడ.మే 15 (globelmedianews.com )   
విజయవాడ ధర్నా చౌక్ లో బీజేపి నేతలు నిరసనకు దిగారు. మంగళవారం కలకత్తా లో పార్టీ జాతీయ అధ్యక్షుడు  అమిత్ షా ర్యాలీ పై జరిగిన దాడికి నిరసనగా ధర్నా జరిపారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు ధర్నాలో పాల్గొన్నారు. డౌన్ డౌన్ మమతా బెనర్జీ అంటూ నినాదాలు చేసారు. 


బీజేపీ ధర్నా

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలిని డిమాండ్ చేసారు. మమతా బెనర్జీని సమర్థిస్తున్న చంద్రబాబుపై ఈసీ చర్యలు తీసుకోవాలి. మోడి ప్రభంజనం అడ్డుకొనేందుకు రాజకీయ దొంగలు ఏకమయ్యారు. అయినా ప్రజలు బీజేపీకే పట్టం కట్టనున్నారని నినాదాలు చేసారు. 

No comments:
Write comments