పుల్వామా మారణహోమానికి కారణమైన ఆర్మీ ఉద్యోగి కక్కుర్తి

 


న్యూ డిల్లీ మే 18 (globelmedianews.com):
అపరిచిత స్నేహాలతో ఆనందం ఎంతన్నది పక్కన పెడితే అపాయం అంతకు మించి ఉంటుందన్న విషయం మరోసారి రుజువైంది. పాకిస్థాన్ కు చెందిన ఒక యువతి పన్నిన వలలో ఒక భారత జవాను చిక్కటమే కాదు.. అతగాడి కక్కుర్తి పుల్వామా మారణహోమానికి కారణమైంది.పుల్వామాలో ఆత్మాహుతి దాడికి సదరు ఆర్మీ ఉద్యోగి అందించిన సమాచారంతో ఉగ్ర ఘటనకు కారణమైన షాకింగ్ నిజం తాజాగా బయటకు వచ్చింది.మధ్యప్రదేశ్ ఉగ్రవాద వ్యతిరేక దళం.. కేంద్ర నిఘా సంస్థలు జరిపిన సంయుక్త దర్యాప్తులో కొత్త విషయాలు బయటకు వచ్చాయి. పుల్వామా మారణహోమానికి కారణమైన ఆర్మీ ఉద్యోగి కక్కుర్తి

ఇండోర్ సమీపంలోని మోహూ పట్టణంలో బిహార్ రెజిమెంట్ లో నాయక్ క్లర్క్ గా అవినాశ్ కుమార్ అనే పాతికేళ్ల యువకుడు పని చేస్తున్నాడు. 2018లో అతనికి అసోం బదిలీ అయ్యింది. ఆ సమయంలో అతని వాట్సప్ కు ఒక పాకిస్థానీ అమ్మాయి పరిచయమైంది.ఆమె అందచందాలకు ప్లాట్ అయిన అతగాడు.. కీలకమైన సైనిక రహస్యాలను ఆమెకు చెప్పాడు. అవినాశ్ దగ్గర సేకరించిన వివరాల్ని ఆమె తీవ్రవాదులకు అందజేసేది. ఇతగాడి సమాచారంతోనే పుల్వామా ఉగ్రదాడికి కూడా ముష్కరులు ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు. పాక్ నుంచి అవినాశ్ అకౌంట్ కు రూ.50వేల మొత్తం వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అతడ్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.

No comments:
Write comments