బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి కూతుర్ల దుర్మరణం

 

వనపర్తి మే 14 (globelmedianews.com):
బట్టలు ఉతకడానికి వెళ్లిన తల్లి కూతుర్లు ఎవరూ ఊహించని రీతిలో కుంటలో పడి మృతి చెందిన సంఘటన సాక్షాత్తు గోపాల్ పేట లో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. గోపాల్ పేట లోని రామ్ నగర్ కాలనీ లో నివాసముంటున్న మాణిక్యమ్మ 26 సంవత్సరాలు కూతురు రుక్మిణి ఆరు సంవత్సరాలు తో కలిసి సోమవారం సాయంత్రం బట్టలు ఉతకడానికి సమీపంలో నీ రెడ్ల కుంట కి వెళ్ళింది.


బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి కూతుర్ల దుర్మరణం

బట్టలు ఉతుకు తున్న మాణిక్యమ్మ ఎవరు ఊహించని రీతిలో కూతురు రుక్మిణితో సహా కుంటల పడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. తీర మంగళవారం ఉదయం కుంట దగ్గరికి వెళ్లి గమనించగా తీసుకుపోయిన బట్టలు కనిపించి రుక్మిణి శవం తేలి ఉండడం గమనించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలపగా తక్షణమే పోలీసులు వచ్చి మృతి చెందిన రుక్మిణి శవాన్ని తీస్తుండగా తల్లి మాణిక్యమ్మ శవం కూడా లభ్యం కావడంతో వారిరువురిని బయటకు తీశారు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు 
చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.. 

No comments:
Write comments