పారదర్శకంగా రెవెన్యూ ప్రక్షాళన

 


సిద్దిపేట, మే 31  (globelmedianews.com)
సిద్దిపేట నియోజకవర్గంలోని 773మంది రైతులకు నేడు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం.  సీఎం కేసీఆర్ పారదర్శకంగా, రెవెన్యూ రికార్డు ప్రక్షాళన చేపట్టారు. గతంలో సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా 59640 మంది పాస్ బుక్స్ పంపిణీ చేశాం.  95 శాతం రెవెన్యూ ప్రక్షాళన పూర్తి అయ్యిందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.  కేసీఆర్ కృషి వల్ల రెవెన్యూ కార్యాలయాలే రిజిస్ట్రేషన్ కార్యాలయలుగా మారుతున్నాయి.  దేశంలో ఎక్కడ లేని విధంగా అవినీతికి ఆస్కారం లేకుండా రెవెన్యూ ప్రక్షాళన పారదర్శకంగా నిర్వహిస్తున్నాం.  


పారదర్శకంగా రెవెన్యూ ప్రక్షాళన
పాస్ పుస్తకాలు ఉన్న రైతులందరికీ10వేల రైతుబందు అందిస్తాం.  రైతులు రసాయనిక ఎరువులు తగ్గించి నేల స్వభావం మారకుండా ఉండేందుకు నత్రజని ఉండే పచ్చి రొట్టె విత్తనాలు వాడాలి.  రసాయనిక ఎరువుల వల్ల క్యాన్సర్ వంటి రోగాలు వస్తున్నాయి.  సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించాలి.  రైతులకు రూపాయి ఖర్చు లేకుండా 100శాతం సబ్సిడీ తో గొర్రెలు,బర్రెల షెడ్లు మంజూరు చేస్తున్నాం.  రైతులు పొలం గట్లపై మొక్కలు నాటాలి.  రేపటి తరం సంతోషంగా ఉండాలంటే ప్రకృతి ని కాపాడాలి, లేకుంటే ఎండలు పెరిగి రాబోయే రోజుల్లో అగ్నిగుండంగా మారుతుందని అన్నారు.

No comments:
Write comments