పల్లె పహాడ్ లో.. పరిహార పండుగ సంబురం..!

 

సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలభిషేకం
- మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు 5వ రోజు చెక్కుల పంపిణీ
- సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు కృష్ణ భాస్కర్, వెంకట్రామ రెడ్డిలను పూలదండలు, శాలువాలతో సన్మానించిన భూ నిర్వాసితులు
సిద్దిపేట,తొగుట, మే 07:(globelmedianews.com)  మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న పల్లె పహాడ్ గ్రామంలో పరిహార పండుగ సంబురం నెలకొన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భూ నిర్వాసితులను అక్కున్న చేర్చుకుని తమ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని.. సీఎం కేసీఆర్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. భూ నిర్వాసిత కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ.. ఇచ్చిన మాట ప్రకారం దగ్గరుండి పరిహారాన్ని అందజేస్తున్న సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు కృష్ణ భాస్కర్, వెంకట్రామ రెడ్డిలను, అధికారిక యంత్రాంగాన్ని ఆనందోత్సాహాలతో.. పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. 


పల్లె పహాడ్ లో.. పరిహార పండుగ సంబురం..!

సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ భూనిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మేరకు 5వ మంగళవారం తొగుట మండలం పల్లె పహాడ్ గ్రామంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పల్లె పహాడ్ గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలోని  కౌంటర్లలో సిద్ధిపేట కలెక్టర్లు క్రిష్ణ భాస్కర్, వెంకట్రామ రెడ్డి, జేసీ పద్మాకర్, సిద్ధిపేట ఆర్డీఓ జయచంద్రా రెడ్డి, ప్రత్యేక ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డిల పర్యవేక్షణలో 104 మంది కుటుంబాలకు, 18 సంవత్సరాల పైబడి ఉన్న వారు 51 మంది, 31 మంది ఇళ్లు లేని వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, 155 ఇళ్ల పట్టాలను, మధ్యాహ్నం వరకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు క్రిష్ణ భాస్కర్, వెంకట్రామ రెడ్డిలు మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. ఉదయం 9గంటలకే చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించినట్లు తెలుపుతూ.. తొగుట మండలం పల్లెపహాడ్ లో చెక్కులన పంపిణీలో ఏర్పాట్లను కలెక్టర్లు పరిశీలించి., శిబిరానికి వచ్చిన వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు.

No comments:
Write comments