గెలుపుపై ఎవరి ధీమా వారిదే

 

విజయవాడ, మే 17, (globelmedianews.com)
ఎన్నికలు ముగిసి నెలన్నర తరువాత కానీ ఫలితాలు వెలువడే ఛాన్స్ లేకపోవడంతో కాకి లెక్కలే అందరికి శరణ్యంగా మారాయి. అయితే అటు తెలుగుదేశం, ఇటు జనసేన సైలంట్ సునామీ పైనే ఆశలు పెంచుకున్నాయి. ఈ విషయంలో టిడిపి గట్టి ధీమానే వ్యక్తం చేస్తుంది. జనసేనాని మాత్రం ఇప్పుడు ఎవరెన్ని అంచనాలు వేసుకున్నా నిజం కావని ఫలితాలు వచ్చాకానే అసలు విషయం తేలుతుందని చేసిన వ్యాఖ్యల్లో ఓటమి భయం తనకేమీ లేదని స్పష్టం చేసేసారు. ఇది పలు రకాల అర్ధాలను ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.అసలు గెలుపు పై నమ్మకం లేనప్పుడు ఓటమి పై భయం దేనికని పవన్ వ్యాఖ్యల్లో అసలు అర్ధాన్ని చెబుతున్నారు. ఇది ఒకరకంగా మానసికంగా జనసైన్యాన్ని సిద్ధం చేయడమేనని, మంచి సంకేతమేనని అంటున్నారు. 


 గెలుపుపై  ఎవరి ధీమా వారిదే

సెంచరీ పైనే సీట్లు అని ప్రకటిస్తున్న వైసిపి, టిడిపి లలో ఎవరు అధికారంలోకి రాకపోయినా ఆ పార్టీ శ్రేణులు డీలా పడతాయని, అదే జనసేన విషయంలో గెలుపు ఓటములు తమకు లెక్క కాదన్న ధోరణి నూరిపోయడం భవిష్యత్తు రాజకీయాలకు పనికొస్తుందని అంచనా వేస్తున్నారు. సైలెంట్ సునామీ అన్నది తమకు ఉందన్న భావనలో ఉన్నా ఫలితాలకు ముందు జబ్బలు చరుచుకోవడం అనవసరం అన్న జనసేన ధీమా పాతికేళ్ళ రాజకీయానికి పునాదులు వేస్తుందో..? లేదో..? కానీ ఆ పార్టీ వికెట్లు ఫలితాలకు ముందే పడిపోతుంటే మాత్రం సైన్యం నిరాశ చెందుతుంది. పార్టీ కోశాధికారి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్ ఇలా అంతా ఫలితాలకు ముందే గుడ్ బై కొట్టడం మంచిదని వెళ్ళిపోతున్నారా ? లేక టిడిపి తో జనసేన కు వున్న అండర్ స్టాండింగ్ నచ్చక వచ్చేశారా? అన్నది త్వరలో తేలనుంది.కర్ణాటక తరహాలో ముఖ్యమంత్రి ఛాన్స్ సంకీర్ణం ఏర్పడితే తనకే దక్కుతుందన్న ప్రచారంతో జనసేనాని తో బాటు సైన్యం అన్యాపదేశంగా చెప్పుకుంటూ వచ్చారు. ఆ తరువాత ప్రభుత్వ ఏర్పాటులో క్రీయాశీలకం అవుతామంటూ ఆ పార్టీ ప్రచారం నడిచింది. ఇక పోలింగ్ ముగిశాక మాత్రం మౌన వ్రతం ఆచరిస్తూ సైలెంట్ సునామీ మంత్రం జపిస్తున్న జనసేన పై మాత్రం అన్ని పార్టీల్లో చర్చ గట్టిగానే నడుస్తుంది. అధినేత మూగనోము తో సోషల్ మీడియా లో కూడా జనసేన హడావిడి కానీ శతఘ్ని సందడి లేకుండా పోవడం విశేషం.

No comments:
Write comments