ఆర్టీసీ చక్రాల నలిగిపోతున్న ప్రాణాలు

 


హైద్రాబాద్, మే 20, (globelmedianews.com)
ఆర్టీసీ రథచక్రాలు కింద పడి నగిలి పోతు ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. బస్సుల బ్రేక్‌ల పనితీరు, డ్రైవర్ల నిర్లక్ష్యం,ఫిట్నెస్ లేని వాహనాలు అంతంత మాత్రమే, ట్రాఫిక్‌లో అతివేగంగా నడుపుతు డ్రైవర్ల దూకుడుకు ప్రాణాలు హరీ అంటున్నాయి..డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న వారికి కళ్లెం వేయని అధికారులు..ఆర్టీసీ రథచక్రాలు మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. బ్రేకులు పడని బస్సులు, డ్రైవర్ల అతివేగం అమాయకుల పాలిట శాపంగా మారుతోంది. ఆర్టీసీ బస్సులు బస్‌బేలు, బస్టాపుల్లో ప్రయాణికుల మీదకే దూసుకెళుతున్నాయి. ప్రతినెలా 3-4 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా నివారణకు ఆర్టీసీ చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. సఫిల్‌గూడ ట్యాంక్‌బండ్‌ వద్ద ప్రధాన రోడ్డుపై బైక్‌ పై వెళ్తున్న ఓ వ్యక్తి  బస్సు ప్రమాదంలో మృతిచెందాడు. ఏప్రిల్‌లో నాలుగు ప్రమాదాలు జరగడం డ్రైవర్ల నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది. ప్రధాన రహదారులపై బస్సుల వేగానికి అదుపులేకుండాపోతోందని ఫిర్యాదులు అందుతున్నా అదుపుచేయడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయ్.ఆర్టీసీ చక్రాల నలిగిపోతున్న ప్రాణాలు

రోజురోజుకూ బస్సులపై నియంత్రణ లేని డ్రైవర్ల సంఖ్య పెరుగుతోందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ల పనితీరు సరిగా లేక రోడ్డు ప్రమాదాలు నగరంలో పెరుగుతున్నాయి. వేగాన్ని నిలువరించాల్సిన అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు బస్సుల ఫిట్‌నె్‌సను పట్టించుకోకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నగరంలో ఆర్టీసీ డ్రెస్త్రవర్లు రోజూ ఏదో ఒక ప్రాంతంలో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. వేగంగా వెళ్లాలనే ప్రయత్నంలో వాహనదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మితిమీరిన వేగంతో బస్సులను నడుపుతూ ద్విచక్రవాహనదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. తమకు కేటయించిన సమయంలో ట్రిప్పులు పూర్తిచేయటానికి కొంతమంది డ్రైవర్లు ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. 20 ఏళ్ల క్రితం బస్సుల సమయపాలన నేటికీ కొనసాగిస్తుండటంతో ట్రాఫిక్‌ వల్ల ఎక్కువ సమయం నడపడంతో ఒత్తిడి పెరుగుతోందని పలువురు డ్రైవర్లు వాపోతున్నారు.పనిచేయని సిగ్నల్‌ లైట్లు నగర రోడ్లపై తిరుగుతున్న దాదాపు  3,657 బస్సుల్లో 60 శాతం వాటికి సిగ్నల్‌ లైట్లు లేవు. కొన్ని బస్సులకు ఉన్నా డ్రైవర్లు వాడరు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మితిమీరిన వేగంతో నడుపుతున్నారు. ప్రధాన రహదారులపై బస్సులు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అర్థంకాని పరిస్థితులు నెలకొంటున్నాయి. పలుప్రాంతాల్లో బస్సులను బస్‌బేల్లో కాకుండా రోడ్లపైనే నిలుపుతుండటంతో ఎక్కేందుకు వెళ్తూ ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు..ప్రతి ఏడాది ప్రారంభం జనవరిలో డ్రైవర్లకు 15 రోజులపాటు రహదారి భద్రతపై శిక్షణ తరగతులు,ఉంటాయి..జూలైలో వారం రోజులపాటు ప్రమాద రహిత వారోత్సవాలు నిర్వహిస్తారు. డ్రైవర్లకు ప్రతిరోజూ డిపో మేనేజర్‌ క్లాసులు చెప్పడంతోపాటు వారంలో ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రాంతీయ స్థాయిలో ఒక్కో డిపోకు నలుగురు చొప్పున డ్రైవింగ్‌పై శిక్షణ పొందడానికి వెళ్తుంటారు. ఇలాంటి జాగత్త్రలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారింది. అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా డ్రైవర్లు ప్రధాన రహదారులపై అతివేగంగా బస్సులను నడుపుతూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు...వీటిపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవలని ప్రజలు కోరుకుంటున్నారు...

No comments:
Write comments