నేర్చిన విద్య తో కుటుంబానికి సహాయపడాలి

 

మాజీ మంత్రి ఆదాల ప్రభాకరన్ రెడ్డి
నెల్లూరు, మే 01 (globelmedianews.com)  
 ఆదాల ట్రస్టు ద్వారా నేర్చుకున్న కుట్టు శిక్షణ ద్వారా కుటుంబానికి సహాయ పడాలని తద్వారా జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు మదరాజు గూడూర్ పల్లెపాలెం లో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు బుధవారం సర్టిఫికెట్ల ప్రదానం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి  సర్టిఫికెట్లను ప్రధానం చేసి  మాట్లాడారు ఏ విద్య అయినా కుటుంబానికి సక్రమంగా ఉపయోగ పడినప్పుడు మాత్రమే దానికి సార్ధకత లభిస్తుందని అభిప్రాయపడ్డారు నేర్చిన విద్య ను ఆచరణలో పెట్టినప్పుడే దాని వల్ల లబ్ధి చేకూరుతుందని తెలిపారు 


నేర్చిన విద్య తో కుటుంబానికి సహాయపడాలి 

1997లో ఆదాల ట్రస్ట్ ను మొదలు పెట్టామని అల్లూరు బోగోలు ప్రాంతాల్లో ఎక్కువగా కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు ఆ సమయంలో సముద్రతీర ప్రాంతాల్లో చాలామందికి చర్మవ్యాధులు కళ్ళ జబ్బులు ఎక్కువగా ఉండవని అందువల్ల వారికి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి  చికిత్స అందించామని చెప్పారు పద్మమ్మ కు సాంఘిక సేవ ఇష్టం అని తెలిసి  ఆమెని నిర్వాహకులుగా పెట్టి  పలు కార్యక్రమాలు చేశామని తెలిపారు 20 ఏళ్ల కిందట మహిళలకు ప్లాస్టిక్ బ్యాగుల తయారీ శిక్షణ కూడా ఇచ్చామని కుట్టు శిక్షణ తోపాటు ప్రింటింగ్ ఎంబ్రాయిడరీ లు కూడా నేర్పుతున్నారు గతంలో  కుట్టిన  వారికి కూలీలు చాలా తక్కువగా ఉండేవి ఇప్పుడది నగరాల్లో చాలా ఎక్కువగా పెరిగిందని చెప్పారు మంచి ధర పలికే చోట మార్కెటింగ్ చేసుకొని వృత్తిని కొనసాగిస్తే గిట్టుబాటు లభిస్తుందని చెప్పారు గతంలో పెనుబర్తి లో కుట్టు శిక్షణ ను అందించామని అది చూసి అడిగినందుకు ఇక్కడ కూడా శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి కోటేశ్వర్ రెడ్డి  మల్లు సుధాకర్ రెడ్డి ఝాన్సీ జీవన్ ప్రసాద్ పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు అంతకుముందు మహిళలు కుట్టు శిక్షణలో భాగంగా తయారుచేసిన దుస్తులను ఆదాల ప్రభాకర రెడ్డి పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి పల్లెపాలెం వాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు

No comments:
Write comments