విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారంలో కిరణ్ పాత్ర మరువలేనిది

 

కిరణ్ సంస్మరణ సభలో  రేవంత్ 
సిద్దిపేట, మే 16 (globelmedianews.com)
యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎన్. కిరణ్ సంస్మరణ సభ ఈ రోజు ప్రెస్ క్లబ్ లో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రేవంత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పెద్దఎత్తున పోరాటాలకు కిరణ్ నాయకత్వం వహించారు.సుమారు 23000మంది కార్మికుల ను విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్ వర్కర్స్ గా విలీనం చేయడంలో కీలకపాత్ర పోషించారు. 


విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారంలో కిరణ్ పాత్ర మరువలేనిది

అనేక ఐక్య పోరాటాలకు కార్యాచరణ రూపొందించినారు. ఈ రోజు విద్యుత్ రంగ కార్మికులకు ప్రతి నెల నెల వేతనాలు రావడంలో కిరణ్ పాత్ర కీలకమైనది.ప్రభుత్వ విధానాలు, అధికారుల సంస్కరణలు, కార్మికుల పై ప్రభావం పైన లోతైన అధ్యాయనం చేసి కార్మికుల ను పోరాటాల వైపు చేసాడు. రాబోయే కాలంలో కూడా కార్మికుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తు,విద్యుత్ రంగాన్ని ప్రజలు పక్షం వుండే విదంగా పోరాటాలు నిర్వహించడమే నిజమైన నివాళి. విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ప్రతి కార్మికుడిని రెగ్యులర్ చేసేవరకు పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు గోపాలస్వామి, యుఈఈయు జిల్లా అధ్యక్షులు చెంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి కాటం మధు,  నాగేందర్, నర్సింమ్మ  చారి, భైరవ చారి,నర్సింలు,రాములు,పర్శారాములు,కనకరాజు,కైలాసం,రాజు, హరి, నర్సింలు తదితరులు పాల్గొన్నారుు.

No comments:
Write comments