గ్లోబరీనా ను ముట్టడించిన విద్యార్ధులు

 

హైదరాబాద్ మే 2, (globelmedianews.com)
బంజారాహిల్స్ లోని గ్లోబరిన కార్యాలయాన్ని విద్యార్ధి సంఘాలు గురువారం ముట్టడించాయి. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై వెంటనే ప్రభుత్వం స్పందించాలి.  ప్రతి పేపర్ రీవాల్యుయేషన్ చేయాలని నినాదాలు చేసారు. గ్లోబరిన సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టి భారీ జరిమానా విధించాలి. 


గ్లోబరీనా ను ముట్టడించిన విద్యార్ధులు

ఇంటర్ బోర్డ్ సెక్రెటరీ అశోక్ కుమార్ ని తొలగించి, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసారు. ఇంటర్ బోర్డ్ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బోర్డును ప్రక్షాళన చేయాలని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధి కుటుంబాలకు 50 లక్షల ఎక్స్  గ్రేషియా ఇవ్వాలి. మరణించిన విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటo చేస్తామని హెచ్చరించారు. 

No comments:
Write comments