ప్రేమికుల జంట ఆత్మహత్య

 

మెదక్ మే 16 (globelmedianews.com)
మెదక్ జిల్లా  కొండపాక మండల పరిధిలోని లకుడారం గ్రామంలో ఇద్దరు ప్రేమికులు ఉరివేసుకొని ఆత్మహత్య. చేసుకున్నారు.కుకునూరుపల్లి ఎస్సై పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం…లకుడారం గ్రామానికి చెందిన మండే కనకయ్య (21) రాచకొండ తారా (19) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం వీరి తల్లిదండ్రులకు తెలియడంతో మందలించారు. రెండు సంవత్సరాల క్రితం ఇదే విషయంలో గ్రామ పెద్దలు కనకయ్యకు 30 వేల జరిమానా విధించారు.


ప్రేమికుల జంట ఆత్మహత్య

అయినప్పటికీ కనకయ్య ,తార ఒకరినొకరు ఇష్టపడుతూ వచ్చారు. కులాలు వేరు కావడంతో ఇరువురు కుటుంబాల్లో వీరి పెళ్లికి ఒప్పుకోరని భావించి బుధవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా భవనంలోకి వెళ్లారు. ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి గురైన కనకయ్య తార ముందుగా వెంట తెచ్చుకున్న విషం తాగారు. అనంతరం పాఠశాల లోని ఓ గదిలోకి వెళ్లి ఓకే తాడుతో ఇద్దరు ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిన్నటి నుంచి వీరిద్దరు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పాఠశాల భవనం నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు లోపలికి వెళ్లి చూడగా ప్రేమికులు ఇద్దరు ఆత్మహత్య చేసుకుని కనిపించింది. మృతుడు కనకయ్య పది రోజుల క్రితమే ఆంజనేయ స్వామి మాలను ధరించాడు. ఈ మేరకు కుకునూరుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాలను పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన కు తరలించారు.

No comments:
Write comments