తక్షణం స్పందించిన ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి

 

రైతులకు అండగా పౌరసరఫరాల సంస్థ 
సిద్దిపేట, మే 15(globelmedianews.com)
అకాల వర్షాలతో తడిసిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తున్నామని, ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం నాడు అకాల వర్షం కురవడంతో సిద్దిపేట నియోజకవర్గంలో పాలమాకుల, దుబ్బాక నియోజకవర్గంలో రామక్కపేటలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. 


తక్షణం స్పందించిన ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి

దీనిపై వెంటనే స్పందించిన ఛైర్మన్ తక్షణమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఛైర్మన్  ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన సిద్దిపేట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు అకాల వర్షంతో ప్రభావితమైన  కొనుగోలు కేంద్రాలను స్వయంగా పరిశీలించారు. రైతుల నుంచి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు పౌరసరఫరాల సంస్థ అండగా నిలుస్తోందని ఛైర్మన్ అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మేరకు గోనె సంచులను అందుబాటులో ఉంచడం జరిగిందని. జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచుల కొరత రాకుండా చూడాలని ఈ సందర్భంగా చైర్మన్ అధికారులను అదేశించారు.

No comments:
Write comments