దీక్ష విరమించిన లక్ష్మణ్

 

హైదరాబాద్, మే 3 (globelmedianews.com)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిమ్స్ హాస్పిటల్ లో శుక్రవారం ఉదయం దీక్ష విరమించారు. లక్ష్మణ్ చే కేంద్ర మంత్రి హన్స్ రాజ్ ఆహిర్ దీక్షను విరమింపజేశారు. అయనకు బీపీ, షుగర్ లెవల్స్ తగ్గి  ఆరోగ్యం విషమించడంతో అభిమానుల్లో తీవ్ర భయాందోళనలు రేగిన నేపథ్యంలో, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఫోన్ మాట్లాడి, ఈ పోరాటాన్ని మరో రూపంలో ఉధృతం చేద్దామన్న సూచన మేరకు లక్ష్మణ్ దీక్ష విరమించారు. 


దీక్ష విరమించిన లక్ష్మణ్ 

హన్సరాజ్ తో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, ఎంపీ దత్తాత్రేయ తదితరులు ఆసుపత్రికి వచ్చారు. రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై గత మూడు రోజులుగా లక్ష్మణ్ దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష ప్రారంభించిన మొదటిరోజే పోలీసులు దీక్షను భగ్నం చేశారు. అనంతరం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.  ఆస్పత్రిలోనే అయన దీక్ష కొనసాగిస్తున్నారు. వైద్య చికిత్సనూ నిరాకరించారు. 

No comments:
Write comments