2 రోజుల్లో ముగియనున్న మున్సిపాల్టీలు

 


నల్గొండ, జూన్ 29, (globelmedianews.com)
మున్సిపల్‌ ఎన్నికలు జూలైలో నిర్వహిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో నాయకుల్లో ఆశలు రేకెత్తాయి.మరో 2 రోజుల్లో మున్సిపాలిటీల పదవీకాలం ముగియనుంది. వచ్చే నెలలోనే ఎన్నికలు నిర్వహించాలనే ప్రభుత్వ ఆలోచన నేపథ్యంలో పార్టీలు సైతం ఇందుకు అనుగుణంగా సన్నద్ధం కానున్నాయి ప్రస్తుతం కొనసాగుతున్న పాలక మండళ్ల గడువు జూలై 2తో ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని పంచాయతీ, పార్లమెంటు, జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలు ముగియగా.. కేవలం మున్సిపల్‌ ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడున్న మున్సిపల్‌ చట్టం స్థానంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా కొత్త పురపాలక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌లో పురపాలకశాఖ  ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సూచనలతోపాటు ప్రభుత్వం పొందుపర్చనున్న అంశాల నేపథ్యంలో కొత్త మున్సిపల్‌ చట్టం రూపకల్పన పూర్తయితే సకాలంలో ఎన్నికలకు జరగనున్నాయి.ప్రజల నుంచి వచ్చిన పురపోరుతో పట్టణాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకుల్లో ఉత్సాహం నిండనుంది. 

 2 రోజుల్లో ముగియనున్న మున్సిపాల్టీలు

ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో బలబలాల అంచనాలపై చర్చలు సాగనున్నాయి. ఇతర జిల్లాలో మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలపై వివాదాలు ఉన్నా ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో విలీన గ్రామాలపై ఎలాంటి వివాదాలు లేకపోవడంతో ఆ గ్రామాల్లో ఎలాంటి సమస్య తలెత్తలేదు. దీంతో శివారు గ్రామాలు కూడా పట్టణంలో కలిసిపోయాయి. దీంతో పురపోరుకు మార్గం సుగమం అయింది.బీసీ గణన పూర్తయ్యాకే ప్రక్రియ జరగనుంది. అక్టోబరులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా జనాభా గణన చేపట్టినప్పటికీ కోర్టు కేసుల నేపథ్యంలో మున్సిపాలిటీలో విలీన గ్రామాల్లో ప్రక్రియ పూర్తి చేయలేదు. అయా చోట బీసీ గణనను రానున్న పది రోజుల్లో పూర్తి చేయగలిగితే వచ్చే నెలఖారు నాటికి ఎన్నికలు జరిపే అవకాశం ఉంటుందనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఆ తర్వాత వెనువెంటనే రిజర్వేషన్ల ఖరారు, వార్డు విభజన జరిగిపోనున్నాయి. ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం  మున్సిపల్ ఎన్నికల కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేసింది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేలా 1965 మున్సిపల్ చట్టానికి సవరణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ మున్సిపల్ నిబంధనల చట్ట సవరణ 2019 ఆర్డినెన్స్ ను జారీ చేసింది. అన్ని మున్సిపాలిటీల్లో వార్డులు ఖరారు చేసింది ప్రభుత్వం. చట్ట సవరణకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించనుంది మున్సిపల్ శాఖ.పురపాలక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హై కోర్టు. దీంతో.. అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను ప్రకటించింది ప్రభుత్వంమున్సిపల్ చట్టానికి సవరణ చేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ తో వార్డులు పెంచుకునేందుకు వీలు కలుగుతుంది. 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో 2631 వార్డులు …ఉండేవి. చట్ట సవరణ ఆర్డినెన్స్ తో ఈ వార్డుల సంఖ్య 3,385 కు పెరిగింది. మొత్తం 754 వార్డులు పెరిగాయి. ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం.

No comments:
Write comments