4 న స్వరూపానంద స్వామిని కలువనున్న జగన్

 


విశాఖపట్టణం జూన్ 3(globelmedianews.com
ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని ప్రత్యేకంగా కలవనున్నారు. జగన్ విశాఖ పర్యటన రేపు ఖరారైనట్టు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రేపు విశాఖకు వెళ్లి స్వరూపానంద స్వామితో జగన్ భేటీ కానున్నారు. అక్కడి నుంచి అమరావతికి చేరుకుంటారు. మంత్రివర్గ విస్తరణ కోసం కసరత్తు చేస్తున్న జగన్.. ముహూర్తం కోసమే స్వరూపానంద స్వామిని కలవనున్నట్టు తెలుస్తోంది. 


4 న స్వరూపానంద స్వామిని కలువనున్న జగన్
ముహూర్తంపై స్వామి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు సమాచారం. జగన్ ప్రమాణ స్వీకార సమయం ముహూర్తాన్ని కూడా స్వరూపానంద స్వామి నిర్ణయించారు. ఈనేపథ్యంలో స్వామిని ఒకసారి కలిసి ఆయన ఆశీస్సులు తీసుకోవాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 8న ఏపీ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.

No comments:
Write comments