ఈఎస్‌ఐ కార్మికుల సభ్యత్వ రుసుము 4 శాతానికి తగ్గింపు

 


హైదరాబద్ జూన్ 14 (globelmedianews.com
ఆరోగ్య భరోసా కల్పించే కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐ) పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సభ్యత్వ రుసుమును తగ్గించింది. ఈఎస్‌ఐ చట్టం కింద వారి నుంచి వసూలు చేస్తున్న మొత్తాన్ని 6.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 


ఈఎస్‌ఐ కార్మికుల సభ్యత్వ రుసుము 4 శాతానికి తగ్గింపు
సాధారణంగా సభ్యత్వ రుసుములో కొంతభాగాన్ని ఉద్యోగి చెల్లిస్తే.. మిగతా మొత్తాన్ని యాజమాన్యం చెల్లిస్తుంది. ఈ లెక్కన ఉద్యోగి సభ్యత్వ వాటాను 1.74 నుంచి 0.75 శాతానికి, యాజమాన్య వాటాను 4.75 నుంచి 3.25 శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సవరించిన  రుసుములు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

No comments:
Write comments