పదేళ్లలో బ్యాంకులపై 53 వేల కేసులు

 


ముంబై, జూన్ 14,   (globelmedianews.com)
దేశీయ బ్యాంకుల్లో చోటుచేసుకున్న 50 వేలకుపైగా మోసాల వల్ల కలిగిన నష్టం రూ.2 లక్షల కోట్లపైనేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం 53,334 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. వీటి విలువ రూ.2 లక్షల 5,735.31 కోట్లని స్పష్టం చేసింది. మోసపోయిన బ్యాంకుల్లో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ ముందుండగా, దీనికి చెందినవే 6,811 కేసులున్నాయన్న ఆర్బీఐ.. ఈ మోసాల విలువ రూ.5,033.81 కోట్లని ప్రకటించింది. అయితే కేసులపరంగా ఐసీఐసీఐ బ్యాంక్ ముందున్నా.. నష్టాలపరంగా మాత్రం పంజాబ్ నేషనల్ బ్యాంక్‌దే అగ్రస్థానం. 2,047 కేసుల్లో ఏకంగా రూ.28,700.74 కోట్లను చేజార్చుకున్నది. 


పదేళ్లలో బ్యాంకులపై 53 వేల కేసులు
ఇక ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ గత 11 ఏండ్లలో 6,793 కేసుల్లో రూ.23,734.74 కోట్లను కోల్పోయింది. కేసులపరంగా రెండో స్థానంలో ఉండగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2,497 కేసులతో రూ.1,200.79 కోట్లతో మూడో స్థానంలో ఉన్నది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద పీటీఐ ప్రతినిధి దాఖలు చేసిన పిటిషన్‌కు ఆర్బీఐ సమాధానమిచ్చిందిమోసాల కారణంగా నష్టపోయిన బ్యాంకు ల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో ఐదు బ్యాంకుల వాటా రూ.90 వేల కోట్లపైనే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ (ఐవోబీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ)ల వాటా రూ.90,401.34 కోట్లుగా ఉండటం గమనార్హం. అలాగే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (రూ.5,598.23 కోట్లు), కెనరా బ్యాంక్ (రూ.5553.38 కోట్లు), యాక్సిస్ బ్యాంక్ (రూ. 5,301.69 కోట్లు)లూ చెప్పుకోదగ్గ స్థాయిలోనే మోసపోయాయి. మొత్తంగా చూసినైట్లెతే ప్రైవేట్ రంగ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులే ఎక్కువగా మోసపోయాయి. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2018-19)లోనే బ్యాంకుల ద్వారా అత్యధిక మోసాలు ప్రకటించబడ్డాయన్న ఆర్బీఐ.. మోసాల విలువ కూడా ఇదే ఏడాది ఎక్కువగా ఉందన్నది. రూ.71,542.93 కోట్ల నష్టం బ్యాంకులకు వాటిల్లిందని వివరించింది

No comments:
Write comments