కార్పొరేట్ కళాశాల పథకానికి 82మంది విద్యార్థుల ఎంపిక

 


ప్రవేశ ఉత్తర్వులను అందజేసిన జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి  అఖిలేష్ రెడ్డి
నాగర్ కర్నూలు, జూన్ 18, (globelmedianews.com)
కార్పొరేట్ కళాశాల పథకానికి నాగర్ కర్నూలు జిల్లా నుంచి 81 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. 2019-20 విద్యా సంవత్సరానికి అర్హుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. ఎంపికైన విద్యార్థుల జాబితాను రాష్ట్ర ఉన్నతాధికారులు  విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, ఎయిడెడ్,  రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యనభ్యసించి పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. 


కార్పొరేట్ కళాశాల పథకానికి 82మంది విద్యార్థుల ఎంపిక
కోరుకున్న శ్రీ చైతన్య, నారాయణ, శ్రీ మిదా, న్యూ శ్రీ చైతన్య, సివి రామన్ మరియు మొదలగు కార్పొరేట్ కళాశాలలో ఉచితంగా ఇంటర్మీడియెట్ విద్యనభ్యసించడానికి సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అవకాశం కల్పించిందన్నారు. జిల్లాలో విద్యార్థుల కోసం  ఇందుకోసం  వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. కార్పొరేట్ కళాశాల పథకానికి ఎస్సీ 29 మంది ఎస్టీలు 35 మంది బీసీలు 13 మంది    ఈబీసీలు 1 మైనార్టీలు 2 దివ్యాంగులు 1 బిసి -సి 1, మొత్తం 82 మంది విద్యార్థులు పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఆధార్ కార్డుల అనుసంధానంతో అర్హులైన విద్యార్థుల ఎంపిక ప్రక్రియను సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర అధికారులే నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో ప్రాథమికంగా ఆన్లైన్ ద్వారా విచారణ చేపట్టి 81 మంది అమ్మాయిలు, బాలురు ప్రతిభావంతుల జాబితా విడుదల చేశారు.

No comments:
Write comments