భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు

 


వనపర్తి,  జున్ 5,(globelmedianews.com):
బుధవారం వనపర్తి జిల్లాలోని అన్ని మండలాలలో ఈద్గా, మసీదుల వద్ద రంజాన్ పర్వదినం ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులకు రంజాన్ పండగ సందర్బంగా జిల్లా ఎస్పీ కె,అపూర్వరావు  శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణవ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే , చిన్నారెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సిఐలు, ఎస్సైలు,వనపర్తి పట్టణంలోని ఈద్గా, దగ్గర ముస్లిం మత పెద్దలను, ముస్లిం  సోదరులను మరియు చిన్నారులను కలిసి ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు  తెలిపినారు. 


భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు
ఎస్పీ  ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో సంబంధిత పోలీసు అధికారులు ఈద్గా, మసీదుల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులు అందరు సోదరభావంతో ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఒకరికొకరు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదే విధంగా అధికారులు సిబ్బంది అందరూ ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. 

No comments:
Write comments