మనిషి ప్రాణం ఎంతో.. చెట్టు ప్రాణం అంతే...

 


చెత్త రోడ్డు పై వేస్తే మన ఆరోగ్యం మన చేతుల్లో లేనట్టే... 
- చెట్లను సంరక్షించాలి... చెత్తను చెత్త బండిలో వేయాలి.. 
- మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు ..
సిద్దిపేట, జూన్ 29 (globelmedianews.com
సిద్దిపేట పట్టణంలో  శనివారం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు  రోడ్డు పై వెళుతున్న క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు కింద పడిన చెట్టు ను చూసి కారులో నుండి దిగారు.. కింద పడిన చెట్టును చూసి షాప్ యజమానిని ,ఇంటి యజమానిని పిలిచి కింద పడిన చెట్టు కనబడటం లేదా? మనిషి ప్రాణం ఎంతో చెట్టు ప్రాణం అంతేకదా ..ఇంటి ముందు ఉన్న చెట్టు సంరక్షించాలి..అప్పుడే మన ఆరోగ్యాన్ని రక్షించుకునేవాళ్ళం అవుతాం అని చెప్పారు.. 

 మనిషి ప్రాణం ఎంతో.. చెట్టు ప్రాణం అంతే...

ఇంటి ముందు ఉన్న మొక్క సంరక్షణ ఒక సామాజిక బాధ్యతగా నిర్వర్తించాలని చెప్పారు... ఇంటి మందు ఉన్న తడి చెత్తను చూసి ఏంటమ్మా ఈ చెత్త.. తడి, పొడి చెత్త వేరు చేసే బుట్టలు ఇచ్చాము..చెత్త బండి వస్తుంది.. మళ్ళీ ఈ రోడ్డు పై...మోరిలో వేయడం ఏంటి అంటూ ప్రశ్నించారు.. మన ఇంటి ముందు చెత్త వేస్తే.. మన ఆరోగ్యం మన చేతుల్లో లేనట్టె అని.. ప్రతి రోజు ఇంటి ముందు కు వచ్చే చెత్త బండిలో చెత్తను వేయాలి.. మన పరిసరాలు మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు..

No comments:
Write comments