ఆర్టీసీ బస్సు బోల్తా

 


డ్రైవర్ తో పాటు ముగ్గురు ప్రయాణికులకు గాయాలు
వనపర్తి  జూన్ 29, (globelmedianews.com)
కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామ సమీపంలో జాతీయ రహదారి 44 పై, ఆర్టిసి బస్సు బోల్తా. రాత్రి సుమారు 2 గంటల సమయంలో, ప్రమాదం జరిగినట్లు సమాచారం. హైదరాబాద్ కాచిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాత్రి కడప నుంచి హైదరాబాద్ బయలుదేరింది.

ఆర్టీసీ బస్సు బోల్తా 

ఈ ఘటన లో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు లో మొత్తం పదిహేను మంది ప్రయాణికులుండగా డ్రైవర్ రవిందర్, తో పాటు దస్తగిరి,జయరామయ్య,సహదేవ్ రెడ్డి అనే ముగ్గురు ప్రయాణికులకు గాయాలు కాగా,దస్తగిరి అనే ప్రయాణీకుని తలకు తీవ్ర గాయాలు కావడంతో  హైదరాబాదు ఆసుపత్రికి తరలించారు. మగిలిన ప్రయాణికుల ను ఇంకొక బస్సు లో  హైదరాబాద్ కు పంపిచినట్లు వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ దేవదానం తెలిపారు. బస్సు డైవర్ నిద్రలోకి జారుకోవడం వల్లే, ఈ ఘటన జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు...

No comments:
Write comments