సమస్యలను పరిష్కారించాలి

 


కర్నూలు, జున్ 1, (globlmedianews.com):
అన్ని శాఖల అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అన్నారు. శనివారం స్ధానిక కలెక్టరేటు నుంచి ప్రజల సమస్యల పరిష్కరార్ధం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రామాన్ని నిర్వహించారు. వివిధ సమస్యల పై  23 ఫోన్ కాల్స్ అందాయి. కొన్ని సమస్యలను అక్కడికక్కడే కలెక్టర్ పరిష్కరించారు. మిగతా  సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని  సంబంధిత అధికారులను ఆదేశించారు. 


సమస్యలను పరిష్కారించాలి

తరువాత కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విధిగా హజరు కావాలన్నారు. అధికారులు చిత్తశుద్దితో పనిచేసి ప్రభుత్వపథకాలను ప్రజలకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసి-2మణిమాల, డిఆర్వొ వెంకటేశం, డిఆర్ డిఏ పీడి రామకృష్ణ, విశ్వేశ్వరనాయడు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.ఈవియంల గోదామును ప్రారంభించిన కలెక్టర్కలెక్టర్ కార్యాలయ ఆవరణలో రూ.1.60 కోట్లతో నూతనంగా నిర్మించిన ఈవియం, వివిప్యాట్స్ ల గోదామును .జిల్లా కలెక్టర్ శనివారం ప్రారంభించారు. 

No comments:
Write comments