గాంధీ ఆసుపత్రిలో జూడాల నిరసన

 


సికింద్రాబాద్, జూన్ 14  (globelmedianews.com)
రెండు రోజుల క్రితం కలకత్తా లో డాక్టర్ల మీద జరిగిన దాడి కి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన  పిలుపు మేరకు గాంధీ ఆసుపత్రిలో శుక్రవారం జూనియర్ డాక్టర్ల నిరసనకు దిగారు. ఈరోజు బ్లాక్ డే గా వర్ణిస్తూ చేతులకు, కాళ్లకు బ్యాండ్లు కట్టుకొని  గాంధీ లో నిరసన ప్రదర్శన చేసారు.

గాంధీ ఆసుపత్రిలో జూడాల నిరసన
ఆసుపత్రి ఆవరణ లో వి వాంట్ జస్టిస్ , వి నీడ్ ప్రొటెక్షన్ అంటూ ర్యాలీ నిర్వహించారు. విరికి ఇతర డాక్టర్లు మద్దతు పలికారు.  డాక్టర్స్ పై దాడులు జరిగితే విధులకు హాజరు కామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే భద్రత కల్పిస్తూ, సెక్యూరిటీ ని కూడ పెంచాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో పెద్దఎత్తున నిరసనలు చేపడతామని తెలిపారు.

No comments:
Write comments