కామారెడ్డి డ్రైవింగ్ స్కూళ్లలలో భద్రత డొల్లే

 

నిజామాబాద్, జూన్ 3, (globelmedianews.com)

డ్రైవింగ్ స్కూళ్లు అంటే ఔత్సాహిక వాహనాదారులకు మంచి, చెడులను నేర్పించే శిక్షణ సంస్థ. రవాణా శాఖ నియంత్రణలో ఉండే డ్రైవింగ్ స్కూళ్లు మోటార్, వెహికిల్ చట్టం ప్రకారం ఏర్పాటు చే యాల్సి ఉంటుంది. కానీ, ఇందుకు విరుద్ధంగా జిల్లాలో పదుల సంఖ్యలో మోటార్ డ్రైవింగ్ స్కూ ళ్లు వెలిశాయి.కామారెడ్డి పట్టణంలో డ్రైవింగ్ స్కూళ్ల పేరిట వెలసిన సంస్థలన్నీ డొక్కు వాహనాల్లో అభ్యర్థులకు శిక్షణ ఇప్పిస్తున్నాయి. పాడైన వాహనాలు, కనీసం నెంబర్ ప్లేటు కూడా లేని కార్లల్లో ఔత్సాహికులతో డ్రైవింగ్ నేర్పిస్తుండడంతో వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్న వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సెకండ్ హ్యాండ్‌లో చౌ కకు కొనుగోలు చేసిన వాహనాల్లో, సరైన కాగితా లు సైతం లేని కార్లను వీటికి వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. డ్రైవింగ్ పాఠాలు బుద్ధిగా చెప్పాల్సిన సంస్థలే అడ్డదిడ్డంగా నడుస్తున్నప్పటికీ రవా ణా శాఖలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం.  వడ్డించే వాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చున్న ఫర్వాలేదన్నట్లు డ్రైవిం గ్ స్కూళ్ల పరిస్థితి తయారైంది.కామారెడ్డి పట్టణంలో నలుదిశలా పదుల సంఖ్యలో డ్రైవింగ్ స్కూళ్లున్నాయి. కొం దరు సపరేటుగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకోగా మరికొందరైతే వాహనాలపై బోర్డులు 


కామారెడ్డి డ్రైవింగ్ స్కూళ్లలలో భద్రత డొల్లే
పెట్టుకుని చక్క ర్లు కొడుతున్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట ప్ర మాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఎవరో ఒకరి నిర్లక్ష్యం మూలంగా విలువైన జీవితాలు నాశనం అవుతున్నాయి. డ్రైవింగ్‌పై కొందరి అజాగ్రత్త, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన రాహిత్యం వం టి కారణాలతో గల్లీ రోడ్ల నుంచి ప్రధాన జాతీయ రహదారుల వరకు రోజు రోడ్డు ప్రమాదాలు చో టు చేసుకుంటున్నాయి. ఇంతలా నష్టం సంభవిస్తున్న డ్రైవింగ్ స్కూళ్ల శిక్షణ తీరుతెన్నులపై పర్యవేక్షణ చేయకపోవడంపై అధికారుల తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి ఇందులో అడ్మిషన్ల స్వీకరణ నుంచి మొదలు పెడితే లైసెన్సుల జారీ అంతా రవాణా శాఖతో ముందస్తు ఒప్పందం ప్ర కారమే జరిగిపోతుంది. స్వతహా డ్రైవింగ్ నేర్చుకు ని లైసెన్సు కోసం వెళ్లిన వారికి ఓ రకంగా, డ్రైవింగ్ స్కూళ్ల నుంచి రవాణా శాఖను సంప్రదించిన వా రికి ఎదురయ్యే రాచమర్యాదల్లో మరో రకంగా తే డాలు కనిపిస్తున్నాయి.రవాణా శాఖలో అధికారుల నిర్లీప్తత, నిర్లక్ష్యం కాస్తా డ్రైవింగ్ నేర్చుకునే ఔత్సాహికుల పాలిట శా పంగా మారుతోంది. ఇబ్బడి ముబ్బడిగా నెలకొల్పిన డ్రైవింగ్ స్కూళ్లలో అడ్మిషన్ తీసుకుంటే చా లు ఇక లైసెన్సు చేతుల్లోకి వచ్చినట్లే. రేటును బట్టి ఫీజులు డిసైడ్ చేస్తున్న డ్రైవింగ్ స్కూళ్లలో ప్రత్యేకంగా స్కీములు సైతం అమలవుతున్నాయి. ఇ దంతా జిల్లా కేంద్రంలోనే సాగుతున్నా కనీసం ప ట్టించుకునే నాథుడు కరువయ్యారు. లర్నింగ్ స్కూళ్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నప్పటికీ వాటిపై నియంత్రణ అన్నదీ మచ్చుకు లేదు. దీంతో వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు మారింది. కామారెడ్డి పట్టణంలో నలుదిశలా పదుల సంఖ్యలో డ్రైవింగ్ స్కూళ్లున్నాయి. కొం దరు సపరేటుగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకోగా మరికొందరైతే వాహనాలపై బోర్డులు పెట్టుకుని చక్క ర్లు కొడుతున్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట ప్ర మాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఎవరో ఒకరి నిర్లక్ష్యం మూలంగా విలువైన జీవితాలు నాశనం అవుతున్నాయి. డ్రైవింగ్‌పై కొందరి అజాగ్రత్త, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన రాహిత్యం వం టి కారణాలతో గల్లీ రోడ్ల నుంచి ప్రధాన జాతీయ రహదారుల వరకు రోజు రోడ్డు ప్రమాదాలు చో టు చేసుకుంటున్నాయి. ఇంతలా నష్టం సంభవిస్తున్న డ్రైవింగ్ స్కూళ్ల శిక్షణ తీరుతెన్నులపై పర్యవేక్షణ చేయకపోవడంపై అధికారుల తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. డ్రైవింగ్ స్కూళ్ల ని ర్వాహకులను అదుపు చేయాల్సిన అవసరం ఇప్ప టికైనా ఎంతైనా ఉంది.

No comments:
Write comments