గోదావరి జలాలను కృష్ణానదికి అనుసంధానం చేస్తాం

 


మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ జూన్ 24 (globelmedianews.com
కృష్ణానది లో రోజురోజుకు నీటి లభ్యత తగ్గుతుండటంతో గోదావరి నది జలాలను కృష్ణ తో అనుసంధానం చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి అంగుళాన్ని సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో తెరాస నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. 


గోదావరి జలాలను కృష్ణానదికి అనుసంధానం చేస్తాం

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం మూలాన తలపుల కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న ఇక్కడి పొలాలు పడవు పడ్డాయని పర్యవసానంగా లక్షల మంది బాంబే గుజరాత్ లాంటి ప్రాంతాలకు వలసలు వెళ్లారు అని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి  జలాలతో నారాయణపేట జిల్లాను పసిడి పంటలు ఖిల్లాగా మారుస్తామన్నారు. చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన నారాయణపేట నేతన్నకు ప్రోత్సాహం లేక పోవడంతో సూరత్ అహ్మదాబాద్ లాంటి ప్రాంతాలకు చేనేత కార్మికులు వలస వెళ్ళారని నేతన్నకు వెన్నుదన్నుగా నిలవడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకునే దిశగా ప్రణాళికలు రచిస్తోందన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అన్ని మునిసిపాలిటీలను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి జడ్పీ చైర్మన్ వనజమ్మ దేవర్ మల్లప్ప బాద్మి శివకుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ తదితరులు పాల్గొన్నారు

No comments:
Write comments