ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై సీఎం ఆగ్రహం

 


హైద్రాబాద్, జూన్ 28, (globelmedianews.com)
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ ఆఫీసులో జరిగిన కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన కేసీఆర్... జూలైలో మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని పార్టీ నేతలకు వెల్లడించారు. ఈ ఎన్నికలకు అంతా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నమోదు చేసిన కేసీఆర్... ప్రతి నియోజకవర్గంలో 50 వేలకు తగ్గకుండా సభ్యత్వ నమోదు ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు.

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై సీఎం ఆగ్రహం

జూలై 20 నాటికి సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని కేసీఆర్ స్పష్టం చేశారు. టీవీ చర్చల్లో ఎవరు పాల్గొనాలనే అంశాన్ని పార్టీ నిర్ణయిస్తుందని... వారు తప్ప మిగతా వాళ్లు టీవీ చర్చలకు వెళ్లకూడదని కేసీఆర్ నేతలకు సూచించారు. అయితే జూలైలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్న, అంజయ్య యాదవ్ చెప్పడంతో... వారిపై కేసీఆర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఘనవిజయం సాధించాలని కేసీఆర్ వారికి చెప్పినట్టు తెలుస్తోంది. 

No comments:
Write comments