పోలీసులు దాడిని ఖండించిన ఎమ్మెల్యే రాజా సింగ్

 


హైదరాబాద్, జూన్ 20, (globelmedianews.com)
హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో పోలీసులు రెచ్చిపోయారని గోశామహల్ శాసనసభ్యుడు రాజా సింగ్ ఆరోపించారు. షాహియనత్  గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జుమ్మేరాత్ బజార్ వద్ద ఉన్న రాణి అవంతి బాయ్ విగ్రహాన్ని  తెల్లవారుజామున తరలిస్తున్న సమయంలో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యే, స్థానికుల పై లాఠీలతో దాడికి పాలుపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురుకి తీవ్ర గాయాలు కావడతో ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ తలపై  పోలీసులు దాడి చేయడంతో, తీవ్ర రక్తస్రావం కావడంతో రాజాసింగ్ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రిలో కి తరలించారు. 


పోలీసులు దాడిని ఖండించిన ఎమ్మెల్యే రాజా సింగ్
రాణి అవంతి బాయ్ విగ్రహంలో  కొన్ని లోపాలు ఉండడం వలన అది బదిలీ చేయడం జరిగిందని, కానీ పోలీసులు ఏలాంటి కారణాలు లేకుండా రాజాసింగ్ తన అనుచరులపై దాడి చేశారని పోలీసులపై స్థానికులు మండిపడుతున్నారు. 2009 లో పెట్టిన ఈ విగ్రహాన్ని ఇప్పటి వరకు గతం లో రెండు సార్లు బదిలీ చేశారు, కానీ ఎప్పుడూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ నెపంతో  హద్దులను మీరి సామాన్య మైన ప్రజల పైనే దాడి కు దిగడం ఎంత వరకు సమంజసం అని  రాజా సింగ్ మండి పడ్డారు. రాజా సింగ్  అతని అనుచరుల పై దాడి చేసిన షాహియనత్ గంజ్ ఏసిపి నరేందర్ రెడ్డి, ఆసిఫ్ నగర్ ఏసిపి నర్సింహ రెడ్డి, ఎస్ఐ గురు మూర్తి, ఎస్ఐ రవి కుమార్  వీళ్ళ తో పాటు అక్కడ ఉన్న స్థానికుల పై దాడి కి పాల్పడ్డ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజా సింగ్ డిమాండ్ చేసారు. దీనికి సంబంధిత ఓ అధికారిక ఫిర్యాదు  డీజీపీ కు ఇస్తామని రాజా సింగ్ అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్న పోలీసులు ఒక ఎమ్మెల్యే ను కూడా చూడకుండా దాడి చేస్తున్నారంటే, సామాన్య ప్రజల పై ఎలాంటి వ్యవహారం ఉంటుందని ఆలోచించాలని రాజా సింగ్ అన్నారు. ఇలాంటి పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

No comments:
Write comments