ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమా గుర్తుకొస్తోంది

 


కడప  జూన్ 8 (globelmedianews.com)

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గ కూర్పు చూస్తుంటే ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమా గుర్తుకొస్తోందని  కాంగ్రెస్ పార్టీ పిసిసి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి అనే పదవే లేదని ఆయన గుర్తు చేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం ఉంటుంది తప్ప ఉపముఖ్యమంత్రిగా ఉండదన్నారు. 


ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమా గుర్తుకొస్తోంది

ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రోటోకాల్, ప్రత్యేక అధికారాల అంటూ ఏవీ ఉండవని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి  ఉపముఖ్యమంత్రి పదవిని ఆరో వేలితో పోల్చారని అన్నారు. ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమాలో ఎమ్మెల్యేలలో ఒకరు ముఖ్యమంత్రి మిగతా అందరూ ఉప ముఖ్యమంత్రులు. అదే మాదిరి జగన్ కూడా తాను ముఖ్యమంత్రిగా ఉంటూ మిగతా 25 మందిని ఉపముఖ్యమంత్రులుగా చేసి ఉంటే ఆయా వర్గాల వారు సంతృప్తి చెందేవారని తులసి రెడ్డి అన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని ఆ ప్రయత్నం చేయవలసిందిగా జగన్ కు తులసిరెడ్డి సూచించారు. 

  

No comments:
Write comments